ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సమన్లు జారీ చేసింది. గతంలో వైఎస్ జగన్ ఆస్తుల కేసులు దర్యాప్తు చేస్తున్న ఈడీ అరబిందో, హెటిరో భూముల కేటాయింపు అంశంపై నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. ఆతర్వాత ఐదు చార్జిషీట్లను సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. నాంపల్లి కోర్టులోని కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలన్న జగన్ కోరగా ఆమేరకు కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోనే సోమవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు పంపింది.
ఈ పరిణామం ఒకరకంగా జగన్ కు ఇబ్బందికరమైనదే అనుకోవాలి. ఎందుకంటే గతంలో జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ వచ్చి కోర్టుకు హాజరై వెళ్లేవారు. తర్వాత ముఖ్యమంత్రి కావడంతో సమయం సరిపోవట్లేదని, పాలనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కాబట్టి వ్యక్తిగత హాజరు నుండి ఆయన మినహాయింపు కోరగా కోర్టు అంగీకరించింది. అంతకుముందు జగన్ ఈ అభ్యర్థనను పలుమార్లు చేసినా పట్టించుకోని కోర్టు సీఎం కావడంతో వెసులుబాటు కల్పించింది. అప్పటి నుండి ఆయన కోర్టుకు వెళ్లట్లేదు. ఆయన తరపున న్యాయవాదులో విచారణలో వాదనలు వినిపిస్తున్నారు. జగన్ కోర్టుకు వెళ్లిన ప్రతిసారీ ఆయన మీద ప్రత్యర్థుల విమర్శలు చేస్తూనే ఉన్నారు. అవి ఒక్కోసారి వ్యంగ్యంగా కూడ ఉండేవి.
వాటి మూలంగా తీవ్ర అసౌకరయం ఫీలైన జగన్ వ్యక్తిగత హాక్జరు మినహాయింపు కోసం గట్టిగా ట్రై చేసి చివరకు ముఖ్యమంత్రి అయ్యాక రిలీఫ్ పొందారు.
కానీ ఇప్పుడు ఈసీ ఉన్నట్టుండి సమన్లు ఇవ్వడంతో జగన్ మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ కోర్టుకు వెళ్లకపోవడంతో ఆయన కేసుల మీద ప్రతిపక్షాల చర్చలు కూడ తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన విచారణకు వెళితే పాత పరిస్థితే రిపీట్ అవుతుంది. అదీకాక ఆయనిప్పుడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి హోదాలో విచారణ అంటే ప్రతిపక్షాలకు ఇంకా మంచి ఆయధం అవుతుంది.
ఇక విజయసాయిరెడ్డి మీద అయితే సెటైర్లు మామూలుగా పేలవు. కేసుల్లో ఇరుక్కురంటున్న టీడీపీ నేతలను ఉద్దేశించి విజయసాయి ఎంత చులకనగా మాట్లాడేవారో అందరూ చూశారు. అలాంటిది ఆయనే మళ్ళీ విచారణకు వెళ్తున్నారు అంటే దెబ్బతిన్న ప్రతిపక్షం ఊరుకుంటుందా. ఖచ్చితంగా వేలెత్తి చూపుతుంది. అసలు సీఎం హోదాలో జగన్, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా చేలామణీ అవుతున్న విజయసాయి కోర్టుకు వెళితే జనం ఎలా ఫీలవుతారో అనేది పెద్ద విషయం. మరి ఈ పరిస్థితిని జగన్, విజయసాయిలు ఎలా తప్పించుకుంటారో చూడాలి.