జాబ్ మేళాలతో వైసీపీ పరువు పోతుందిగా.. అలాంటి కంపెనీలు అవసరమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ సర్కార్ ఏకంగా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. వైసీపీ సర్కార్ నిర్ణయం వల్ల నిరుద్యోగులకు తీవ్రస్థాయిలో ప్రయోజనం చేకూరింది. ఆ తర్వాత వైసీపీ సర్కార్ భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య తక్కువేననే సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ సర్కార్ వేర్వేరు ఊర్లలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నా ఆ జాబ్ మేళాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పవచ్చు.

ఎందుకంటే ఆ జాబ్ మేళాలలో హెల్పర్ ఉద్యోగాలు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు మినహా ఇతర ఉద్యోగాలను భర్తీ చేయడం జరగదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను భర్తీ చేసినా చాలా తక్కువ సంఖ్యలోనే ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. అయితే తాజాగా జాబ్ మేళాలలో పాల్గొన్న కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేయడంతో అందుకు సంబంధించి పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తోంది.

వైజాగ్ లో జరిగిన జాబ్ మేళాలో పాల్గొన్న రెండు కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా రివర్స్ లో డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశాయని తెలుస్తోంది. జాబ్ మేళాలతో వైసీపీ పరువు పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జాబ్ మేళాలకు హాజరయ్యే కంపెనీల పూర్తి వివరాల గురించి సమాచారం తెలుసుకోకుండా వైసీపీ తప్పు చేస్తోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇతర పార్టీల నేతలు విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా వైసీపీ జాగ్రత్త పడాల్సి ఉంది. డబ్బులు వసూలు చేసే కంపెనీలపై వైసీపీ చర్యలు తీసుకుంటే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నమోదవుతున్న పోలీస్ కేసుల విషయంలో విజయసాయిరెడ్డి స్పందన ఏ విధంగా ఉంటుందో తెలియాల్సి ఉంది.