బీజేపీపై కట్టలు తెంచుకున్న చంద్రబాబు ఆవేశం: ప‌వ‌ర్‌ఫుల్‌ డైలాగ్స్

శ్రీకాకుళం జిల్లా పలాసలో సోమవారం తిత్లీ బాధితులకు 350 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఆ తర్వాత క్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప‌వ‌ర్‌ఫుల్‌ డైలాగ్స్ తో బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇటీవలే ఆయన ఢిల్లీ వెళ్లి పలు పార్టీల అధినేతలతో భేటీ అయ్యారు. ఆయా విషయాలపైన కూడా ఆయన చర్చించారు. ఆయన ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

“బీజేపీ పార్టీ టీడీపీని అణగదొక్కాలని చూస్తోంది…ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోతా” అంటూ ప‌వ‌ర్‌ఫుల్‌ డైలాగ్స్ తో బీజేపీని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అరాచకాల వల్లే కాంగ్రెస్ సహకారం కోరాల్సి వచ్చిందని తెలిపారు. మోదీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను టీడీపీ ఏకతాటిపైకి తీసుకొస్తోంది. టీడీపీ తీసుకున్న ఈ చొరవను దేశం మొత్తం అభినందిస్తోందని వ్యక్తం చేశారు.

“ప్రజాస్వామ్యాన్ని మోదీ అపహాస్యం చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టించారు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఈడి, సిబిఐ, ఆర్బీఐ, ఆఖరికి పత్రికా స్వేఛ్ఛనుకూడా దెబ్బతీశారు. అందుకే నేను ఢిల్లీ వెళ్లాల్సొచ్చింది. దేశం కోసం అన్ని పార్టీలను ఒకేతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేపట్టానని తెలిపారు. పదవులు ఆశించి ఈ పని చెయ్యట్లేదు…దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటే మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుంది. ఇవన్నీ ఆలోచించి అన్ని పార్టీలను కలిపే పనికి శ్రీకారం చుట్టను అని స్పష్టం చేశారు.

ఆఖరికి కాంగ్రెస్ దేశంలో ఎక్కడా లేని పరిస్థితి ఉన్నా…ఆ పార్టీని కూడా పోరాటానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశానంటే, అందుకే బీజేపీ అరాచకాలే కారణం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం తిత్లీ తుఫాను సహాయం కింద ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలియజేసారు. ఎంతోమంది చనిపోయిన స్పందించలేదంటే…వారికీ మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు.

నేను పలాసలో ఉండి తుఫాను బాధితులకు అండగా ఉంటే గుంటూరులో బీజేపీ కార్యాలయానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన నేతలు టీడీపీని తిట్టి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం కేంద్రానికి పన్నులు కడుతున్నాం. అలాంటప్పుడు కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నిధులిచ్చి ఆదుకోవాలి. విపత్తు సమయంలో ఇక్కడకు రావలసిన అవసరం లేదా? ఎందుకు రారు అంటూ బీజేపీ పెద్దల్ని నిలదీశారు ఏపీ సీఎం చంద్రబాబు.