నీళ్లేమో వారానికొకసారి, పన్నేమో రు.1800: కోటం రెడ్డి అసంతృప్తి

366 రోజుల ప్రజా ప్రస్థానంలో భాగంగా 26వ డివిజన్, బుజబుజ నెల్లూరులో పర్యటించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడి పరిస్థితులను చూసి అవక్కాయ్యారు. స్థానిక ప్రజలతో  సమస్యలపై ఆరాతీస్తూన్నపుడు అనేక వింత సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. ఇదంతా అధికారుల సమక్షంలోనే జరగింది.  ఈ  పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు చెప్పారు.

బుజబుజ నెల్లూరులో ప్రధానమయిన నీటి సమస్య. అక్కడ వారానికొక నీళ్ల చిలకరించి, కొళాయి పన్ను మాత్రం భారీ వసూలు చేస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

వారానికి ఒకసారి నీళ్లు ఇస్తూ, 1800 రుపాయల కొళాయి పన్ను ఎలా  వేస్తారా, ఇాది అన్యాయమని కమీషనర్ ను ప్రశ్నించారు. వారానికి ఒకసారి నీళ్లిస్తూ ఇలా పన్ను వసూలు చేసే అధికారం ఎవరిచ్చారని కమిషనర్  ఎమ్మెల్యే ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో, నగర కార్పొరేషన్ లో విలీన గ్రామాల, శివారు కాలనీలపరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉందని ఆయన విమర్శించారు. నగరకార్పొరేషన్ కేటాయించే నిధులు ఏ మాత్రం సరిపోయే పరిస్థితి లేదని అన్నారు.

బుజబుజ నెల్లూరులో నీటి సమస్యపై గత నాలుగేళ్లుగాశక్తి వంచన లేని కృషిచేస్తున్నానని, అయినా అధికారులు ఇక్కడి పరిస్థితులను మెరుగుపరిచనందుకు చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బుజబుజ నెల్లూరును  శ్మశాన వాటికి సమస్య కూడా పీడిస్తూ ఉందని, ఈ శ్మశాన వాటికిను చూస్తే కడుపు రగిలే పరిస్థితి ఉందని  చెబుతూ 10వేల జనాభా ఉండే ప్రాంతంలో శ్మశాన వాటిక లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ సమస్య మీద అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని సూచించారు. ఈ పరిస్థితి మెరుగుపరిచేందుకు శక్తి వంచన లేని కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.