ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై వ్యతిరేకతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా ఎవరికి వారు తమ వంతు కష్టపడుతున్నారు. అయితే షర్మిల భర్త, జగన్ బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ కూడా తాజాగా సీఎం జగన్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. బ్రదర్ అనిల్ కుమార్ జగన్ పేరెత్తకుండానే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ప్రజలు తమ స్వార్థం కోసం ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ పై ఆధారపడవద్దని ఆయన సూచనలు చేశారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని చెబుతూ ఆయన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రజలకు ఈ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో పుట్టి ఉంటే బాగుండేదనే భావన ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. జగన్ బంధువులే ఆయన గురించి వ్యతిరేక ప్రచారం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
గతంలో కూడా అనిల్ కుమార్ ఇలాంటి కామెంట్లు చేశారు. షర్మిల పార్టీకి జగన్ సపోర్ట్ చేయకపోవడం వల్లే ఈ తరహా కామెంట్లు వ్యక్తమవుతున్నాయని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ ఎన్ని మంచి పనులు చేస్తున్నా ఆయన ప్రభుత్వం చేస్తున్న చిన్నచిన్న తప్పులనే అందరూ ఎత్తిచూపుతున్నారు. ఒక విధంగా జగన్ ఒంటరి వ్యక్తి అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ కు ఎవరి సపోర్ట్ లేకపోయినా ప్రజల సపోర్ట్ ఉందని ప్రజలే ఆయనను గెలిపిస్తారని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. జగన్ ను టార్గెట్ చేసే వ్యక్తులు ఇకనైనా మారాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం గమనార్హం.