బ్రేకింగ్ : పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు..?

what is the YSRCP next strategy

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకూ ఇంటికే పరిమితం చేయాలని ఆదేశించారు. మీడియాతో కూడా పెద్దిరెడ్డిని మాట్లాడనివ్వకుండా కట్టడి చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీకి లేఖ రాశారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఎన్నికలు సజావుగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిమ్మగడ్డకు సహకరిస్తే అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి వైద్య సౌకర్యాల కోసమే బయటకు వెళ్లాలని, అప్పుడు కూడా మీడియాతో మాట్లాడకుండా చూడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.

ఎన్నికల్లో ఏకగ్రీవాలపై మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ చర్యలు ప్రారంభించారనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని మంత్రి అన్నారు. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతాం’ అని పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.