బ్రేకింగ్ : ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ .. ఎందుకంటే ?

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు హీటెక్కింది. తోలి విడత పోలింగ్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతుంది. పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రశస్తే లేదని చెప్తున్నారు. ఇదిలా సాగుతున్న నేపథ్యంలో తాజాగా వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరు మండలం కామనూరులో వరదరాజులరెడ్డి తన సోదరులు, అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ నాయకుడు నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపైకెళ్లి దౌర్జన్యం చేశారు. సెల్ ‌ఫోన్‌ లాక్కుని మహిళలను దూషించి భయాందోళనకు గురిచేశారు. నామినేషన్‌ విత్‌డడ్రా చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఓటింగ్‌ ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుతో వరదరాజులరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.