అభినంద్ పాక్ భూభాగంలో పడడంతో దేశమంతా అభినంద్ గురించే ఆలోచించారు. కానీ అదే సమయంలో అదే ప్రమాదంలో ఓ పైలట్ వీరమరణం పొందారు. దీనిని కనీసం ఏ మీడియా కూడా చూపించకపోవడం దారుణమని పలువురు విమర్శించారు. శత్రు విమానాలను తరుముతూ ఛాపర్ కుప్పకూలి స్క్రాడన్ లీడర్ సిద్ధార్ధ్ వశిష్ట్ ప్రాణాలు విడిచారు. ఆయన భార్య ఆర్తీ సింగ్ కూడా పైలెట్.
ఓ వైపు వీరమరణం పొందిన భర్త… మరో వైపు ఆగని కన్నీటి ధార. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొని, బాధను గుండెల్లో దిగమింగుకుని తన యూనిఫాం వేసుకొని ఆమె భర్త అంత్యక్రియల్లో పాల్గొంది. ఈ ఘటన అందరిని కన్నీరు పెట్టించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జమ్ము కశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో ఎంఐ-17 ఛాపర్ కూలిన ఘటనలో స్క్వ్రాడన్ లీడర్ సిద్దార్ధ్ వశిష్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య ఆర్తీ సింగ్ కూడా స్క్వ్రాడన్ లీడర్. జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త దేశ రక్షణ కోసం పోరాడి వీరమరణం చెందడంతో ఆమె విషాద చాయల్లో మునిగిపోయారు.
భర్త భౌతికకాయాన్ని చూస్తూ దీనంగా రోధించింది. భారత జాతీయ పతాకాన్ని చేతపట్టుకొని భర్త పార్ధివ దేహం వద్ద నివాళులు అర్పించింది. అనంతరం వశిష్ట్ తండ్రి చితికి నిప్పంటించాడు. తన జీవితం పై ఎన్నో కలలు కన్న ఆర్తీ కలలు కల్లలయిపోయాయి. దేశ రక్షణ కోసం భర్త వీరమరణం పొందడంతో తన భర్త ఆశయాలను తాను సాధిస్తానని ఆమె గుండె నిబ్బరం చేసుకొని చెప్పారు.