థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ వ్యవహారం ఏమయ్యిందో చూశాం. మహాసేన రాజేష్ పరిస్థితేంటో చూస్తున్నాం. వాట్ నెక్స్‌ట్.? బోరుగడ్డ అనిల్ కూడా రూటు మార్చబోతున్నారా.? వైసీపీ తీరు పట్ల ఆయన అసంతృప్తితో వున్నారా.? అసలేం జరుగుతోంది.?
నిజానికి, వైసీపీతో బోరుగడ్డ అనిల్‌కి నేరుగా ఎలాంటి సంబంధాల్లేవట. ఆయనేమో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడట. అలాగని ఆయనే చెప్పుకుంటున్నాడు. కానీ, ఆ పార్టీలో ఆయనకు సభ్యత్వమే లేదట. ఆ విషయాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిథులు చెబుతున్నారు.
కానీ, వైసీపీ నుంచి బోరుగడ్డ అనిల్‌కి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్నాయి. ఓ కత్తి మహేష్.. ఓ శ్రీరెడ్డి.. ఓ పోసాని కృష్ణమురళి.. వీళ్ళంతా వైసీపీ సానుభూతిపరులు. ఆ లిస్టులోనే బోరుగడ్డ అనిల్ కూడా. ఊరికే ఎవరైనా సానుభూతిపరులుగా వుంటారా.? తెరవెనుకాల వాళ్ళకి అందాల్సినవి అందుతుంటాయ్.. సహాయ సహకారాలన్నమాట.
మీడియా ముందు అడ్డగోలుగా మాట్లాడేసి, ‘రేప్’ బెదిరింపులకు దిగితే, అది చట్ట వ్యతిరేక చర్య అవుతుంది. వైసీపీ మాత్రం ఎంతకాలం ఇలాంటోళ్ళని వెనకేసుకొస్తుంది.? విషయం పెద్దదయ్యింది. ఇంకోపక్క, బోరుగడ్డ అనిల్‌కి అంత సీన్ లేదని తేలిపోయింది. దాంతో, వైసీపీ నుంచీ సహాయం ఆగిపోయిందట.
దాంతో, ఏం చేయాలో తెలియక అనిల్ కాస్త మెత్తబడ్డారు. మునుపటి వేడి అయితే ఆయనలో లేదు. ఆయన్ని తెలుగుదేశం పార్టీ దువ్వడం మొదలుపెట్టిందట. అయినాగానీ, టీడీపీని ఇంకా తిడుతూనే వున్నారు అనిల్. మరి, జనసేన వైపు ఆయన వెళతాడా.? పవన్ కుమార్తెపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినోడ్ని జనసేన రానిస్తుందా.?