జనసేన డ్యామేజ్‌ కంట్రోల్‌… బొలిశెట్టిని గట్టిగా వాయిస్తున్నారు!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వారాహి యాత్రలో భాగంగా… కాకినాడలో నిర్వహించిన సభలో పవన్ శృతి తప్పారు! ముద్రగడపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై అవాకులూ చెవాకులూ పేలారు! ఈ సమయంలో ముద్రగడ సీరియస్ అయ్యారు. పవన్ పై లేఖాస్త్రాలు సంధించారు. తాజాగా ఆ విమర్శల వల్ల – ఈ లేఖల వల్ల జనసేనకు జరిగిన డ్యామేజ్ అర్ధంచేసుకున్నట్లున్నారు జనసేన నాయకులు.

అవును… ముద్రగడ… పవన్ కు తొలిరేఖ రాసిన అనంతరం జనసైనికులు ఆయనపై ఫైరయ్యారు. కొంతమంది తనకు ఫోన్ చేసి బూతులు తిట్టడం వంటివి చేశారని ముద్రగడ ఆరోపించారు. దీంతో మరింత సీరియస్ గా పవన్ కు లేఖ రాశారు. పవన్ గాలి తీసినంత పనిచేశారు. ధమ్ముంటే పిఠాపురం రా అన్నస్థాయిలో సవాళ్లు విసిరారు. అయితే ఈ లేఖలపై మౌనాన్నే తన బాషగా చేసుకున్న పవన్… ఆ ఊరు దాటి మరో ఊరువెళ్లిపోయారు!

అయితే ఇలా ముద్రగడ విషయంలో చూపించిన అత్యుత్సాహం వల్ల జరిగిన డ్యామేజ్ పై జనసేనతలు ఇప్పుడు కళ్లు తెరిచినట్లున్నారు. అందులో భాంగా పార్టీలో కీలక నేత, పవన్ సన్నిహితుడు అయిన బొలిశెట్టి సత్యనారాయణ ఒక వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభంపై ఎవరు కూడా ఏ విధంగానూ స్పందించవద్దని కోరారు. పవన్ కల్యాణ్‌ ను ఉద్దేశించి ముద్రగడ ఎలాంటి లేఖ రాసినా దానిపై దయచేసి స్పందించవద్దని బొలిశెట్టి కోరారు.

అదే విధంగా… పవన్‌ కు వ్యతిరేకంగా ముద్రగడ రాస్తున్న లేఖలపై స్పందించటం వల్ల ఇష్ట్యూ పూర్తిగా డైవర్ట్ అయిపోతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ వారాహి యాత్ర చేస్తుంటే… ఇష్యూమాత్రం ముద్రగడ రాసిన లేఖల చుట్టే తిరుగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా జనసైనికులకు గుర్తుచేశారు. సరే ఈ మాత్రం జాగ్రత్తలు భయంతోనో, గౌరవంతోనో తీసుకోవడం తప్పులేదు కానీ… ఈ సందర్భంగా జగన్ పేరు ప్రస్థావిస్తూ.. ఒక పూర్ లాజిక్ తీశారు బొలిశెట్టి!

అవును… ముద్రగడ – పవన్ ల వ్యవహారం పీక్స్ కి వెళ్లిన సమయంలో… జగన్మోహన్ రెడ్డి కావాలనే ఇదంతా చేయిస్తున్నారు అంటూ బొలిశెట్టి ఒక పూర్ కామెంట్ చేశారు. దీంతో బొలిశెట్టి అవగాహనపైనా, ఆయనకు మాత్రమే సొంతమైన ప్రత్యేక జ్ఞానంపైనా స్పందిస్తూ ఒక సూచన చేస్తున్నారు పరిశీలకులు.

కారణం… ముద్రగడ వర్సెస్ పవన్ ఇష్యూలో అసలు జగన్ కు ఏ రకంగా సంబంధం అంటగడుతున్నారో బిలిశెట్టికే తెలియాలి. ఎందుకంటే… ఇప్పటివరకూ పవన్ పై ముద్రగడ ఏనాడూ స్పందించలేదు. జనసేనపై ఎప్పుడూ మాట్లాడింది లేదు. తనపనేంటో తాను చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో… కావాలని ముద్రగడను ముందుగా గెలికింది పవన్ కల్యానే అన్న విషయం బొలిశెట్టి జ్ఞానానికి తెలియకపోతే ఎలా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్నగా ఉంది.

ఇలా పవ్న చేసుకున్న డ్యామేజ్ పనుల వెనక కూడా జగన్ ఉన్నారన్ని చెప్పుకోవడం జనసేన దిగజారుడుతనం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో బొలిశెట్టి అజ్ఞానంపై ఆన్ లైన్ వేదికగా విరుచుకుపడిపోతున్నారు నెటిజన్లు.

ఇలా తనకు తాను ముందుగా ముద్రగడపై విమర్శలు చేశారు పవన్. అలా గుడ్డ కాల్చి తనపై వేసే మరో ఊరు వెళ్లిపోదామని భావించిన పవన్ ను ముద్రగడ వెంటపడి మరీ వాయించి వదిలిపెట్టారు. తన లెవెల్ ఏమిటో చెప్పకనే చెప్పారు. కాపు సమాజానికి తాను చేసిన సేవ ఏమిటో వివరించారు. దీంతో వంగవీటి రంగా బావమరిది సైతం మైకుల ముందుకు వచ్చి ముద్రగడ తరుపున మాట్లాడారు. మరిముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మెజారిటీ కాపు నేతలు, ప్రజలు ముద్రగడకు అనుకూలంగా స్పందించడం మొదలుపెట్టారు.

దీంతో… జరుగుతున్న డ్యామేజ్ ని పవన్ & కో ఆలస్యంగా గ్రహించారు! ముద్రగడతో పెట్టుకుంటే గోదావరి జిల్లాల్లో జనసేన మనుగడ ప్రశ్నార్ధకం అనే ఆలోచనకు తెరలేపారు. ఆఖరికి పిఠాపురం లో పోటీచేసే విషయంలో కూడా పవన్ వెనకడుగు వేశారని అంటున్నారు. దీత్మో… డ్యామెజ్ కంట్రోల్ పనులు మొదలుపెట్టిన జనసేన… ఇకపై ముద్రగడ విషయంలో ఎవరూ స్పందించొద్దని.. ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయవద్దని కోరుతున్నారు.