పవన్ కి పురందేశ్వరి ఫోన్… తెరపైకి స్మూత్ వార్నింగ్?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో జరిగిన ఎన్ డీయే కూటమి సమావేశానికి జనసేనకు ఆహ్వానం అందడం.. పవన్ హస్తిన వెళ్లి ఆ సమావేశంలో పాల్గొనడం.. ఈ సమయంలో పొత్తుల గురించి ప్రస్థావించడం తెలిసిందే.

రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నట్లుగా పవన్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఏపీలో పొత్తు పాలిటిక్స్ పై చర్చలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా… టీడీపీని మిత్రపక్షాల భేటీకి బీజేపీ పిలవలేదు. దీంతో… టీడీపీని వీలైనంత దూరం పెట్టాలన్నదే బీజేపీ పెద్దల ఆలోచన అని తెలుస్తుంది.

మరోపక్క పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీ – బీజేపీ – జనసేన కలిసే పోటీచేస్తాయని అంటున్నారు! మరి బీజేపీని ఒప్పించగలనే నమ్మకమో ఏమో కానీ.. బీజేపీ పెద్దల అనుమతి, అంగీకరం తెలపకుండానే పొత్తులపై మాట్లాడుతున్నారని తెలుస్తుంది. దీంతో పురందేశ్వరి.. పవన్ కు ఫోన్ చేశారని అంటున్నారు.

అవును… జనసేన అధినేత ఢిల్లీలో మరోమారు పొత్తుల ప్రస్థావన తెచ్చిన అనంతరం పురందేశ్వరి ఫోన్ చేశారని అంటున్నారు. ఈ సమయంలో హస్తిన నుంచి ఏపీకి వచ్చిన అనంతరం కూర్చుని మాట్లాడుకుందామని అన్నారని సమాచారం. ఇదే సమయంలో… బీజేపీ జాతీయపార్టీ అనే విషయం మరిచిపోయి.. అంత పెద్ద పార్టీతో పొత్తులో ఉన్నామన్న విషయం గుర్తుపెట్టుకోకుండా.. పొత్తుల గురించి ఎలా బడితే అలా మాట్లాడొద్దని అన్నారని ఊహాగాణాలు వెలువడుతున్నట్లు తెలుస్తుంది.

దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తుందని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలవడం ఇష్టం లేని వర్గానికి పురందేశ్వరి పెద్ద అని అంటుంటారు. ఈ సమయంలో ఆమెకు ఏపీ అధ్యక్ష భాధ్యతలు అప్పగించారు బీజేపీ పెద్దలు. దీంతో… టీడీపీతో బీజేపీ కలిసే విషయం ఆల్ మొస్ట్ క్లోజ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ పరిస్థితుల్లో తన పార్టీ నిర్ణయాలు, వారాహి యాత్రల్లో పొంతన లేని స్టేట్ మెంట్స్ లాగా… బీజేపీ తీసుకోబోయే నిర్ణయాలపై కూడా ఊహాజనిత స్టేట్ మెంట్స్ కానీ, మీడియాకు లీకులు ఇచ్చేలా కానీ మాట్లాడొద్దని… కాస్త స్మూత్ గానే పవన్ కు చిన్నపాటి వార్నింగ్ బీజేపీ పెద్దలనుంచి పురందేశ్వరి ద్వారా వెళ్లిందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన వాస్తవాలు అవాస్తవాలు తెలియాల్సి ఉంది!