మధ్యప్రదేశ్‌లోని గునా – శివపురి రహదారిపై బీజేపీ ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. టోల్ రుసుం చెల్లించాలని టోల్ ప్లాజా సిబ్బంది.. బీజేపీ ఎంపీ వాహనాన్ని ఆపారు. తాము ప్రజాప్రతినిధులమని చెప్పడంతో.. వారి ఐడీ కార్డులను టోల్ ప్లాజా సిబ్బంది అడిగారు.
మమ్మల్నే ఐడీ కార్డులు చూపించమని అడుగుతారా.. అంటూ టోల్ సిబ్బందిపై ఎంపీ నందకుమార్, ఆయన అనుచరులు, గన్‌మెన్లు దాడి చేశారు. వాకీటాకీలను ధ్వంసం చేసి.. అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇక ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఎంపీ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వీడియో కింద ఉంది చూడండి.