TG: నాకు తిక్కలేస్తే అల్లు అర్జున్ కేసు నేనే వాదిస్తా… ఎంపీ రఘునందన్ షాకింగ్ కామెంట్స్!

TG: అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అల్లు అర్జున్ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడం తప్పని పోలీసులు చెబుతున్నారని.. కేసులో కోర్టు ట్రయల్ ఉండగా సీపీ ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా తప్పే కదా అంటూ ఈయన ప్రశ్నించారు.

సినిమా యాక్టర్ తప్పు చేస్తే ఒక రూల్.. కమిషన్ తప్పు చేస్తే మరో రూల్ ఉండొద్దు కదా అని సెటైర్లు వేశారు. ఇక అల్లు అర్జున్ కేసును బీజేపీ నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఈయన పూర్తిస్థాయిలో తిప్పి కొట్టారు. చేతకాని కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో 886 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అయితే కనీసం ఆ విద్యార్థులను పట్టించుకునే వారు కూడా ఈ రాష్ట్రంలో లేరని మండిపడ్డారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి మరణించడం నిజంగా బాధాకరమైన విషయం అయితే ఆమె కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడం అభినందనీయమే కానీ, గురుకులాల్లో జరిగిన ప్రభుత్వ హత్యల సంగతేంటని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇలాగే అల్లు అర్జున్ కేసు విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికైనా తమ వాదనను నిలిపివేయాలి. నాకు కనుక తిక్కరేగితే ఈ కేసును నేనే టేకప్ చేసి వాదిస్తాను అంటూ వృత్తిపరంగా లాయర్ అయినటువంటి ఎంపీ రఘునందన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.