బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..సిటిలో టెన్షన్ టెన్షన్(వీడియో)

ఎమ్మెల్యే రాజాసింగ్ ను ధూల్ పేట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గో రక్షకులపై తప్పుడు కేసులు పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ దానికి నిరసనగా బషీర్ బాగ్ సీపీ ఆఫీసు ముందు నిరవధిక దీక్ష చేస్తానని రాజాసింగ్ ప్రకటించారు.రాజాసింగ్ దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు ఆయనను ధూల్ పేటలో అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఆయనను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. రాజాసింగ్ ను అరెస్టు చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

దీక్షకు బయలుదేరేముందు రాజాసింగ్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

గోరక్ష ఉద్యమం కోసం తాను ఎంతవరకైనా పోరాడుతానని రాజాసింగ్ అన్నారు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని సార్లు అరెస్టు చేసినా మళ్ళీ వచ్చి సీపీ ఆఫీసు ముందు దీక్ష చేస్తానని హెచ్చరించారు. రాజాసింగ్ ను అదుపులోకి తీసుకొని బొల్లారం పీఎస్ కు తరలించారు.గో రక్ష ఉద్యమం కోసం రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే  పదవితో పాటు తన బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి పూర్తిగా గో రక్షణ ఉద్యమానికి ఆయన అంకితం అయ్యారు. రాజాసింగ్ అరెస్టు, బుధవారం బక్రీద్ ఉండటంతో హైదరాబాద్ సిటిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అల్లర్లు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.