ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నారు గోషామహల్ బిజెపి తాజా మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఆయన గతంలో బిజెపికి గుడ్ బై చెప్పారు. తాను గో రక్షా ఉద్యమం చేయడానికి బిజెపి అడ్డంకిగా ఉందన్నారు. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారు. కానీ ఆయన రాజీనామా ను బిజెపి యాక్సెప్ట్ చేయలేదు.
తాజాగా బిజేపి నేత రాజా సింగ్ ఫేస్ బుక్ హాక్ అయిందని తెలిసింది. కొందరు దుండగులు తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేసినట్లు రాజా సింగ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన అకౌంట్ హ్యాక్ చేసి తన అకౌంట్ నుంచి 5,00,000 ఫేస్ బుక్ ఖాతాదారులకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నటు ఫిర్యాదు చేశారు రాజా సింగ్.
ఆయన ఫిర్యాదుపై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తన అఫిషియల్ ఫేస్ బుక్ హ్యాక్ అయిందని, ఈ విషయమై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని రాజా సింగ్ తన ట్విట్టర్ అకౌంట్ వాల్ మీద పోస్టు పెట్టారు. ఆ పోస్టు కింద ఉంది చూడండి.
రాజా సింగ్ ట్విట్టర్ లింక్ ఇదే.