వైఎస్ జగన్ ఏమిటి కెఏ పాల్‌తో పొత్తు పెట్టుకోవడం ఏమిటని కంగారుపడుతున్నారా. అసలు జగన్ లాంటి తిరుగులేని నాయకుడికి కెఏ పాల్‌తో స్నేహం చేయాల్సిన అవసరం ఏమిటని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా. అయితే ఈ పొత్తు అవసరం జగన్ కు కాదు బీజేపీకి. ఏపీలో బలపడాలని భారతీయ జనతా పార్టీ ఆరాటపడుతోంది. అందుకోసం అనుకూలమైన అన్ని మార్గాలను వెతుకుతోంది. మొదట్లో ప్రభుత్వం మీద మామూలు విమర్శలు చేసినవారు మెల్లగా తన ట్రేడ్ మార్క్ రాజకీయం అందుకున్నారు. దేవాలయాలు, దేవుళ్ళు అంటూ జగన్ మీద దాడికి దిగారు. ఏపీలో కొన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి. రథం దగ్దమవడం, విగ్రహాలు విరగడం లాంటివి జరిగాయి. అసలే మతపరమైన, దేవుళ్ళకు సంబందించిన వివాదాలంటే బీజేపీకి మాహా ఇష్టం. అందుకే వెంటనే వాటిలోకి దూరేసి నానా యాగీ చేయాలని చూశారు. జగన్ క్రైస్తవుడనే విషయాన్ని పదే పదే గుర్తుచేశారు.
జగన్ పాలన మొదలైననాటి నుండి క్రైస్తవుల హవా ఎక్కువైందని, హిందూ మతం మీద దాడి మొదలైందని, తిరుమలల్పో అన్యమత ప్రచారం ఎక్కువైందని అంటూ జగన్ మీద హిందూ వ్యతిరేకి అనే ముద్రవేయాలని చూశారు. కానీ అవేవీ పెద్దగా ఫలించలేదు. అందుకే తెలంగాణ బీజేపీ ఫార్ములాను అందిపుచ్చుకుంటున్నారు వారు. జగన్ క్రైస్తవుడు కాబట్టి హిందువులకు అన్యాయం చేసే చర్యలు అనేకం చేస్తున్నారని, బయటకు కనబడకుండా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారని జనం ముందు షో చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి ఆ వీలు దొరకడం లేదు. నిజానికి తెలంగాణలో అంటే మజ్లీస్ పార్టీ ఉంది కాబట్టి బీజేపీ పని సులువైంది. హైదరాబాద్ ముస్లిం రాజుల కబంధ హాస్టల్లో నలిగిపోయింది, ఇది హిందూ దేశమని అంటూ మజ్లీస్ పార్టీతో చేతులు కలిపిన కేసీఆర్ త్వరలోనే పాత పరిస్థితులు తీసుకొస్తారని ప్రచారం చేశారు.
హిందూత్వ కార్డును గట్టిగా ప్లే చేశారు. ఈ కార్డు హిందూ డామినేటెడ్ ప్రాంతాల్లో పనిచేయకపోయినా మిగతా చాలాచోట్ల వర్కవుట్ అయింది. అందుకే దాన్నే ఏపీ ఉపఎన్నికల్లో ప్రయోగించాలని చూస్తున్నారు. అయితే అక్కడ మజ్లీస్ ఉన్నట్టు ఏపీలో క్రైస్తవ నాయకుడి నేతృత్వంలో క్రైస్తవ ప్రయోజనాల ప్రాతిపదికన నడిచే బలమైన ఉండాలని భావించారు. కానీ వారికి అలంటి బలమైన పార్టీ ఏదీ కనబడలేదు. దీంతో వారి కన్ను కెఏ పాల్ నడుపుతున్న ప్రజాశాంతి పార్టీ మీద
పడిందట. కానీ పాల్ చూస్తే జగన్ మీద ఇంతెత్తున లేస్తున్నాడు. జగన్ ఏమో ఆయన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. ఇలా ఉంటే కమల దళం ప్లాన్ ఫలించదు కదా. అందుకే వారంతా ఒక్కటే కోరుకుంటున్నారు.
ఏదైనా పెనుమార్పు జరిగి పాల్, జగన్ పొత్తుల్లోకి వస్తే మజ్లీస్ పార్టీని చూపించి కేసీఆర్ ను దెబ్బకొట్టినట్టే క్రైస్తవుడు అయిన కెఏ పాల్‌ను ఎదురుగా నిలబెట్టి హిందూత్వం మంటగలుస్తుందనే ప్రాపగాండా స్టార్ట్ చేసి వదిలితే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చని భావిస్తున్నారట. పాల్ మీద జగన్ ప్రేమ అన్నట్టు ఏకిపారేయవచ్చని ఆశించారు. కానీ పాల్, జగన్ కలవడం జరిగే పని కాదు. ఇటీవల జగన్ మీద పాల్ శాపనార్థలు పెట్టారు. కెఏ పాల్‌తో కలిసి పనిచేయాలనే ఆలోచన కూడ జగన్ మనసులో పుట్టదు. కనుక బీజేపీ పగటి కల కలగానే మిగిలిపోతుందన్నమాట. జరగని ఈ పని గురించి ఎన్ని అనుకుని ఏం లాభమనుకున్న కమలనాథులు నేరుగా తెలంగాణ నుండి బీజేపీ నాయకులను తిరుపతి ప్రచార బరిలోకి దింపాలని చూస్తున్నారట. బండి సంజయ్, అరవింద్, రాజాసింగ్, రఘునందన్ లాంటి వారిచేత క్యాంపెనింగ్ చేయించి హిందూత్వాన్ని వాడుకునే ఆలోచన చేసున్నారట.