పొత్తు పంచాయతీ… కొత్త ఇరకాటంలో పవన్ కి మూడు ఆప్షన్లు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల పంచాయతీ మరోసారి తెరపైకి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు కన్ ఫాం అని అటు టీడీపీ నేతలు, కేడర్ తో పాటు ఇటు జనసైనికులు కూడా ఫిక్సయినట్లు తెలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో తాము మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టంగా చేబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయాలపై ఇప్పటికే మంత్రులు సైతం స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాజాగా బొత్స సత్యన్నారాయణ స్పందిస్తూ… ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తుల కోసం పాకులాడుతాయంటూ వ్యాఖ్యానించారు.

సమయంలో మైకందుకున్న మాదవ్… ఆంధ్రాలో తమ పార్టీ పొత్తు కేవలం జనసేనతోనే ఉందని స్పష్టం చేశారు. ఇక, మరో పార్టీతో ఈ రోజు దాకా పొత్తులు కానీ స్నేహాలు కానీ లేవని ఆయన తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఈనెల 18న ఎన్డీఏ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం పంపలేదని ఆయన వివరించారు. టీడీపీకి ఇన్విటేషన్ వచ్చిందంటూ ఎల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ గా మాధవ్ ఈ వివరణ ఇచ్చారని అంటున్నారు.

దీంతో ఇప్పుడు జనసేన ఆలోచన ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. ఒక పక్క బీజిఏపీ పెద్దలేమో జనసేనతోనే ఈ దఫా ఎన్నికలకు వెళ్తామని పదే పదే నొక్కి వక్కానిస్తున్నా పరిస్థితి. దీనికి తోడు టీడీపీతో కలిసి వెళ్లబోతున్నామని ఇప్పటికే జనసైనికులు ఫిక్సయిపోయారు. అదేవిధంగా టీడీపీ – జనసేన పొత్తు పక్క అని నమ్ముతూ, జనాలను నమ్మిస్తూ ఒక వర్గం మీడియా పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తుంది. లోకేష్ ను కాదని కవరేజ్ ఇస్తుంది.

పవన్ చరిష్మా టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషిం చబోతోందని ఆ వర్గం మీడియా బలంగా నమ్ముతుంది. ఈ పరిష్తితుల్లో… జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా కేవలం బీజేపీతోనే కలిసి ఎన్నికలకు వెళ్తారా.. లేక, చంద్రబాబు & కో కోరుకుంటున్నారని కథనాలొస్తున్నట్లుగా సైకిల్ ఎక్కి వెళ్తారా.. లేక, తాను ఆశిస్తున్నట్లు బీజేపీ – టీడీపీలను ఏకం చేయగలుగుతారా అన్నది వేచి చూడాలి.

ఏది ఏమైనా… పొత్తుల పేరు చెప్పి, వీరమరణం అని భయపడుతున్న పవన్… రెండు బలమైన పార్టీల అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నారు జనసైనికులు.