నేషనల్ లెవల్ బీజేపీ ఎదురులేని పార్టీగా బీజేపీ వెలిగిపోతోంది. తనకు అడ్డుగా ఉన్నవారిని బీజేపీ తన వ్యూహాలతోసి చిత్తు చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉంటామని వెల్లడించిన బీజేపీ రాష్ట్రంలోకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని తిడుతూ, చంద్రబాబు నాయుడుని తిడుతూ కాలక్షేపం చేస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించినా కూడా రాష్ట్రమలో పార్టీ చేస్తున్న కార్యకలాపాల్లో మార్పులు ఏమీ రాలేదు.
అసలు బీజేపీలో నేతలు ఉన్నారా?
గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో బీజేపీ నాయకుల వైఖరి చూస్తుంటే అసలు బీజేపీలో నేతలెవరైన ఉన్నారా? అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే గత నెల రోజుల నుండి బీజేపీ నాయకులు న్అసలు మాట్లాడిన సందర్భాలు కనిపించడం లేదు. అధ్యక్ష స్థానం నుంచి దిగిపోయిన కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడా కానరావడం లేదు. టిడిపి నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వారి అనుచరుల హడావిడి పూర్తిగా సద్దుమణిగిపోయింది. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడిగిన వారిని, అమరావతికి మద్దతు పలికిన వారిని, చెప్పకుండా టీవీ చర్చలకు వారిని ఇలా తొలగించు కుంటూ పోయేసరికి ఉన్న కొద్ది మంది నేతలూ దూరం అయ్యారు. ఇలా పార్టీ నుండి నేతలు మెల్లగా జరుకోవడం వల్ల ఇప్పుడు అసలు బీజేపీలో నేతలు ఉన్నారా అనే అనుమానం వస్తుంది.
జగన్ వ్యూహానికి బలైన బీజేపీ
సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటిసారి మూడు రాజధానుల అంశం తీరంమీదికి తెచ్చినప్పుడు ఈ నిర్ణయం వెనక బీజేపీ హస్తముందని రాష్ట్రంలో ప్రజలు అనుకోవడం మొదలు పెట్టారు. ఈ విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికితెలిసినా కూడా ఎక్కడా కూడా ఖండించలేదు. ఎందుకంటే మూడు రాజధానుల నిర్ణయం వల్ల వస్తున్న వ్యతిరేకతను వైసీపీతోపాటు బీజేపీకి కూడా అట్టించాలనుకున్నాడు, ఈ విషయం చాలావరకు జగన్మోహన్ రెడ్డి విజయం సాదించాడు. కేంద్రం కూడా మూడు రాజధానుల విషయంలో తాము ఏమి చేయలేమని చెప్పడంతో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ప్రజల్లో వ్యతిరేకత పెరగడం వల్లే ప్రస్తుతం బీజేపీ నాయకులు సైలెంట్ గా ఉన్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. జగన్ వేసిన వ్యూహానికి మూడు రాజధానుల అంశంపై బీజేపీపై కూడా వ్యతిరేకత పెరిగింది.