గవర్నర్ గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం

ఏపికి పూర్తిస్ధాయి మొట్ట మొదటి గవర్నర్ గా బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటి వరకూ ఇఎస్ఎల్ నరసింహన్ తెలంగాణా, ఏపికి ఉమ్మడి గవర్నర్ గా ఉన్న విషయం అందరకీ తెలిసిందే. ఒడిస్సా బిజెపిలో సీనియర్ నేతల్లో ఒకరైన హరిచందన్ ఆ రాష్రంలో ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు.

విజయవాడలో కొత్తగా రూపుదిద్దుకున్న రాజ్ భవన్లో  నూతన గవర్నర్ గా హరిచందన్ తో హై కోర్టు చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, మంత్రులు, స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి లాంటి అత్యున్నత స్ధాయి వ్యక్తులంతా హాజరయ్యారు.

1971లో జనసంఘ్ లో చేరిన హరిచందన్ అంచెలంచెలుగా ఎదిగారు. తర్వాత బిజెపిలో చేరిన బిశ్వభూషణ్ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా, ఒడిస్సా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1975లో ఎమర్జెన్సీని వ్యతరేకించినందుకు హరిచందన్ జైలుకు కూడా వెళ్ళాల్సొచ్చింది.

1980-88 మధ్యలో బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. సాహిత్యమంటే ఇష్టపడే హరిచందన్ మొరుబొత్తాస్, రాణా ప్రతాప్, శేషఝులక్, అష్టశిఖ, మానసి పుస్తకాలను ఒరియాలో అనువధించారు. మొత్తం మీద నరేంద్రమోడితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఏపికి గవర్నర్ గా నియమితులయ్యారు.