చంద్రబాబుకు ఐటీ అధికారులు ఇచ్చిన నోటీసులు, అనంతర పరిణామాల నేపథ్యంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే చంద్రబాబు చుట్టూ ఉచ్చు బలంగా బిగుస్తోందని, చంద్రబాబు ఈ సారి దొరికిపోవడం ఖాయమని.. ఎన్ టీఆర్ ఆంత బాబుని వెంటాడుతుందని కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిల్సిందే.
ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పైగా చంద్రబాబు అరెస్టును ఎవరూ ఆపలేరంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్న వేళ… ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీంతో ఇప్పుడు దీనికి తోడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం మరోసారి తెరపైకి వచ్చింది.
చంద్రబాబు ఐటీ స్కాంలోకి ఇప్పుడు ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది. ఐటీ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ స్కాం లలో మూలాలు ఒకేచోట ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో… ఏపీ సీఐడీ విచారణకు సన్నద్ధమైంది. రెండు స్కాంలలోనూ దాదాపు ఒకటే మూలాలు ఉండటం.. అక్కడా ఇక్కడా కూడా ఒకే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో వ్యవహారం పెద్దదవుతుందని తెలుస్తుంది.
దీంతో… తాజాగా వెలుగులోకి వచ్చిన ఐటీ స్కాం తో పాటు గతంలో సంచలనంగా మారిన స్కిల్ డవలప్మెంట్ స్కాం లోనూ పాత్రదారులు ఒక్కరే అనే విషయం వెలుగులోకి రావడంతో ఈ సీఐడీ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా… స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాకు, ఐటీ స్కాంలో కీలక వ్యక్తిగా పేర్కొన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని కి వేరు వేరుగా ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. త్వరలో వీరిని విచారించనుంది.
దీనికి తోడు నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీశాఖ విచారణ జరుపుతోన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాల వ్యవహారంలో భాగంగా… టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ధరలు పెంచి.. ఫలితంగా ఆయా కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే ఉన్న అభియోగాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఉన్నాయి!
అటు ఐటీ స్కాం లోనూ, ఇటు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలోనూ చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పైనా కీలక అభియోగాలు మోపబడ్డాయి! ఈ రెండు కీలకమైన స్కాంల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని, ఇందులో విదేశాల్లో కూడా డబ్బు చేతులు మారిందని దర్యాప్తు సంస్థలు అంటున్నాయని తెలుస్తుంది. దీంతో… ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది.
ఇదే సమయంలో దుబాయిలోనూ చంద్రబాబు డబ్బు అందుకున్నట్లుగా అభియోగాలు ఉండటంతో దీనిపై కూడా దృష్టి పెట్టనుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా త్వరలో విచారణ బృందం దుబాయికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇది మనీల్యాండరింగ్ తో ముడిపడిన విషయం అంటూ ఆరోపిస్తున్న మంత్రులు… దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగాలని కోరుతున్నారు.
దీంతో చంద్రబాబు చుట్టూ ఉచ్చు భారీగానే బిగుస్తుందని.. ఈసారి చంద్రబాబు దొరకడం కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలో… ఈ కేసు ఎంత తొందరగా ముగుస్తుందనేది వేచి చూడాలి.