విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారింది. విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అంటేనే టీడీపీకి కంచుకోట లాంటివి. కానీ జగన్ రాకతో క్షేత్ర స్థాయిలో ఆ కోటలకు బీటల స్థాయి మరింత పెరిగింది. ఇక విశాఖని రాజధానిగా ప్రకటించడంతో సీన్ మొత్తం మారిపోయింది. విశాఖ అభివృద్ధిలోకి వస్తే వలసలు బాధ తప్పుతోందన్న భావన ఉత్తరాంధ్ర జిల్లా వాసుల్లో బలంగా నాటుకుంది. ప్రతీ ఏడాది వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి లక్షలాది మంది తమిళనాడు, తెలంగాణ, మహరాష్ర్ట రాష్ర్టాలకు వలసలువెళ్తుంటారు. ఆ రెండు జిల్లాల్లో పనులు లేకనే ఈ దుస్థితి ఎదురయ్యేది. అయితే జగన్ రాకతో విశాఖ రాజధాని కావడంతో భవిష్యత్ లో ఈ వలస వ్యధలుండవని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఈ మూడు జిల్లాలు ఇప్పుడు జగన్ వెంటేనని తేలిపోయింది. విశాఖ జిల్లా టీడీపీ నుంచి బలమైన నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు వైసీపీ గూటికి చేరితే టీడీపీ స్వరూపమే మారబోతుంది. గంటా జంప్ ఖరారైతే ఆయన వెంట స్థానికంగా చాలా మంది నేతలు వచ్చేయనున్నారు. ఇప్పటికే పంచకర్ల రమేష్ బాబు ప్యాన్ కిందకి చేరిన సంగతి తెలిసిందే. ఇక విశాఖ నుంచి టీడీపీ కుర వృద్ధులంటే! చింతకాయల అయ్యన్న పాత్రుడు, వెలగపూడి రామకృష్ణబాబు పేర్లు వినిపిస్తాయి. అయితే గంటా టీడీపీని వదిలేస్తే వాళ్లిద్దరి ప్రాబల్యం అక్కడ తగ్గుతుంది.
అందుకే గంటాకు వైసీపీ లైన్ క్లియర్ చేస్తుంది. ఆ రకంగా టీడీపీ జిల్లాలో మరింత బలంగా మారడం ఖాయం. ఇక విజయనగరంలో మంత్రి బోత్స సత్సనారాయణ హవా నడుస్తోంది . టీడీపీ సీనియర్ నేతగా అశోక్ గజపతి రాజు ఉన్నా! ప్రస్తుతం మాట్లాడే పరిస్థితి లేదు. ఆయనకు చుట్టూ మాన్సాస్ ట్రస్ట్ ఉచ్చు బిగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక టీడీపీకి మరో కంచుకోటైన శ్రీకాకుళంలో కూడా బీటలు మొదలయ్యాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత స్థానికంగా ఆ ఫ్యామిలీపై నెగిటివిటీ బాగా ఎక్కువైంది. అదిప్పుడు జిల్లా మొత్తం వ్యాపిస్తోంది. ఇలా ఉత్తరాంధ్రలో టీడీపీని నేలమట్టం చేసే దిశగా జగన్ భారీగానే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.