బిగ్ షాకింగ్ : ఆంధ్ర ప్రదేశ్ కి నిర్మల సీతారామన్? జగన్ కి క్లాస్ పీకడం కోసం ?

రాజకీయ నాయకుల తీరు ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది. అధికారంలో ఉంటే ఓ గొంతు , అధికారంలో లేకపోతే మరో గొంతుతో మాట్లాడుతుంటారు. అధికారంలో ఉన్న సమయంలో అయ్యా సమస్య ఉంది అని వస్తే మాట్లాడటానికి సమయం ఉండదు కానీ , అధికారం పోయి ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల సమస్యల్ని తామే పరిష్కరిస్తాము అన్నంతగా బిల్డప్ ఇస్తుంటారు. ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ నాయకులకి రాష్ట్రం పై ప్రేమ పెరిగిపోయింది. ఓ వైపు నా స్వర్ణాంధ్రను జగన్ సర్వనాశనం చేస్తున్నాడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపుగా ప్రతీ రోజూమీడియా ముందు ముసలి కన్నీళ్లు కరుస్తుంటే , తాజాగా ఆయనకు సాయంగా ఇద్దరు మాజీ మంత్రులు కూడా రంగంలోకి దిగారు.

ap cm ys jagan delhi tour
 

ఏపీ ఆర్ధిక వ్యవస్థ అన్ని విధాలుగా భ్రష్టు పట్టింది, ఖజానా ఖాళీ కావడం కాదు, పూర్తిగా చిల్లు పడిపోయింది. ఈ రాష్ట్రాన్ని కాపాడడం ఎవరి తరం కాదు అంటున్నారు మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఖజానా కళకళలాడినట్లుగా కలరింగు ఇస్తున్నారు యనమల. కేంద్రం అర్జంటుగా ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీని ప్రకటించాలి అని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలమ్మ ఏపీకి వచ్చి పరిస్థితి అంచనా వేయాలని చెప్తున్నారు. ఇక ఏపీలో శాంతి భద్రలు ప్రశ్నార్ధకం అయ్యాయట. ఎటు చూసినా దౌర్జన్యాలు, దోపిడీలేనట. ఏపీలో జనం భద్రత లేక బెంబేలెత్తిపోతున్నారుట. ఇక విపక్షాలను అయితే బెదిరించి భయపెట్టేస్తున్నారుట. ఈ రకమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదని
మాజీ మంత్రి చినరాజప్ప తెగ పరేషాన్ అవుతున్నారు.

నిన్నమొన్నటి వరకు చంద్రబాబు ఒక్కరే ఏపీ పై ప్రేమ ఒలకబోసేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మరో ఇద్దరు మాజీ మంత్రులని కూడా రంగంలోకి దించారు. అయితే , చంద్రబాబు లాంటి వ్యక్తి విమర్శలు చేసినప్పుడే పట్టించుకోలేదు , వీరు చేస్తే పట్టించుకుంటరా అనేది ప్రస్నార్ధకం. అయితే ప్రయత్నించడంలో తప్పులేదు కదా !