నిమ్మగడ్డ తమకి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నాడు అని ఆనందించేలోపు చంద్రబాబు కి షాక్ !

nimmalagadda ramesh kumar supports chandrababu naidu

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీకి జెడ్పీటీసీ అభ్యర్థి షాక్ ఇచ్చారు. చిలకలూరిపేట మండలం జెడ్పీటీసీ అభ్యర్థిని వట్టిగుంట విజయలక్ష్మి, భర్త వెంకట్‌ తో కలిసి రాష్ట్ర అటవీ, విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే విడదల రజిని సమక్షంలో వైసీపీ లో చేరారు.

విజయలక్ష్మి, వెంకట్ దంపతుల్ని ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీ ఇంఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య చిలకలూరిపేటలోని పార్టీ ఆఫీసుకు తీసుకొచ్చి చేర్చారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్లు విజయలక్ష్మి అన్నారు. విజయలక్ష్మి మొదటి నుంచి వైఎస్సార్‌సీపీలోనే ఉన్నారట.

ఆమె భర్త వెంకట్‌ పార్టీలో ఉన్నారని.. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్‌లో సంబరాలు చేసుకున్నారట. మళ్లీ ఎట్టకేలకు సొంత గూటికి చేరారట. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతన్న సమయంలో జెడ్పీటీసీ అభ్యర్థి ఇలా పార్టీ మారడం టీడీపీకి తలనొప్పిగా మారింది.

ఈ రోజు జారీ చేసిన నోటిఫికేషన్ తో ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ నెల 25న‌ అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 27 వ‌ర‌కు నామినేషన్లు స్వీక‌రిస్తారు. 28న‌ నామినేషన్లు పరిశీలిస్తారు. అనంత‌రం 29న‌ నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. 30న‌ ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. అనంత‌రం, 31 మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గ‌డువు ముగుస్తుంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల అవుతుంది. ఫిబ్ర‌వ‌రి 5న పోలింగ్ నిర్వ‌హిస్తారు.