మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం సాయంత్రం కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదన్న తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం ఈ సందర్భంగా తప్పుబట్టింది.
అవును… హైకోర్టు ఆదేశాలు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తున్నాయని అభిప్రాయపడిన సుప్రీం.. అవినాష్ బెయిల్ విషయంలో ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను తప్పుపట్టింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సమంజసంగా లేవని అభిప్రాయపడింది.
ఇదే క్రమంలో… వివేకా హ్యత కేసు గడువును సైతం సుప్రీం పొడిగించింది. అవును.. ఇక ఏప్రిల్ 30వ తేదీ లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసి, ఛార్జిషీట్ దాఖలు చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు… తాజాగాగా జూన్ 30వ తేదీ వరకు కేసు గడువును పొడగించింది.
ఈ నేపథ్యంలో… హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొట్టేసిన తరుణంలో.. అవినాష్ తరపు న్యాయవాది తన తరుపు వాదనలు వినిపిస్తూ… “అరెస్ట్ ను ఒక రోజు వాయిదా వేయాలి” అని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అయితే “జనవరి 23న సమన్లు చేసిన సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేది, ఇప్పుడీ 24 గంటల కోసం రిలీఫ్ ఇవ్వలేము… ఈ కేసులో సీబీఐ పూర్తి సంయమనంతో ఉంది” అంటూ సుప్రీం తెలిపింది.