కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కేసులో కేసీఆర్ సర్కార్‌కు ఊరట

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల కేసు విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై 2 నెలల స్టే విధిస్తూ డివిజన్  బెంచ్ తీర్పునిచ్చింది. హై కోర్టు చరిత్రలోనే శాసనసభ స్పీకర్ కు, కార్యదర్శి, అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీ, డిజీపి, ఎస్పీ లకు నోటిసులు అందించడంపై డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డివిజన్ బెంచ్ లో తీవ్ర వాదోపవాదనల తర్వాత జడ్జీ రెండు నెలల స్టే విధించారు.

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ లను వెంటనే ఎమ్మెల్యేలుగా గుర్తించి వారికి సదుపాయాలు కల్పించాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అప్పిల్ చేయగా విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై 2 నెలల స్టే విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. దీనిని కాంగ్రెస్ కు ఎదురు దెబ్బగా చెప్పవచ్చని టిఆర్ ఎస్ నేతలు అంటున్నారు.  తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు న్యాయవాది ముఖుల్ రోహిత్ వాదించారు. కేసు విచారణ నడుస్తున్నంత సేపు తీవ్రమైన వాద ప్రతివాదనలు నడిచాయి. కోమటిరెడ్డి, సంపత్ లు ఏ విధంగా కౌంటర్ ఇవ్వనున్నారో అనే చర్చ మొదలైంది.