కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లు ప్రస్తుతం తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికతో కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని కేసీఆర్ కు ఉద్యమ సమయంలో కోట్ల రూపాయలు ఇచ్చానని ఆయన వెల్లడించడం గమనార్హం. టీ.ఆర్.ఎస్ లోకి రమ్మని కోరినా వెళ్లలేదని 33 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ కోసం పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు.
మునుగోడు ఉపఎన్నికలో కచ్చితంగా ఓడిపోయే ఛాన్స్ అయితే లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతుండటం గమనార్హం. మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ను కాంగ్రెస్, టీ.ఆర్.ఎస్ పార్టీలు కలిగి ఉండకపోవడం గమనార్హం. అన్న భవిష్యత్తు కోసమే బీజేపీలో ఆలస్యంగా చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించడం గమనార్హం. మునుగోడు ఉపఎన్నికలో అధికార పార్టీకి ఓటమి తప్పదని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరు ఉండటం, బీజేపీ సైతం ఉపఎన్నికను సీరియస్ గా తీసుకోవడం, ఆర్థికంగా కోమటిరెడ్డికి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం, ఇతర కారణాల వల్ల మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడే ఛాన్స్ అయితే ఉంది. బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మారిపోయే ఛాన్స్ అయితే ఉంది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మారాలనుకునే అభ్యర్థులు సైతం ఏ పార్టీలో చేరితే తమకు భవిష్యత్తు ఉంటుందనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.