ఎన్టీఆర్ వల్ల ఇండస్ట్రీకి కష్టాలు వచ్చాయా.. ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్న టాలీవుడ్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న ఎన్టీఆర్ తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ని కలిసిన విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం పట్ల ఇటు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. అమిత్ షా ఉన్నఫలంగా ఎన్టీఆర్ ను కలవడం వెనుక ఉన్న కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ అమిత్ షా నుకలవడం పట్ల ఎన్టీఆర్ పై కెసిఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం.

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలహీనపరచడం కోసం బిజెపి ప్రభుత్వం హీరోలను టార్గెట్ చేస్తూ వస్తున్నారని ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నితిన్ వంటి హీరోలతో కలిసి సంప్రదింపులు జరిపారని వార్తలు వినపడుతున్నాయి. ఇలా బిజెపి నేతలు టాలీవుడ్ హీరోలను కలవడంతో కెసిఆర్ టాలీవుడ్ పరిశ్రమ పట్ల వ్యతిరేకత చూపిస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి.
ఇందులో భాగంగానే తాజాగా ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనబోయే బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ఇలా ఈ ఈవెంట్ రద్దు వెనుక కేసీఆర్ హస్తము ఉందనే ఆరోపణలు కూడా వెళ్ళుతాయి.

ఇలా ఎన్టీఆర్ అమిత్ షా నీ కలవడం పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలు ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారని ఎన్టీఆర్ కలవడం వల్లే ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ పట్ల వ్యతిరేకత ఏర్పడిందని ఇకపై ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కూడా ఇండస్ట్రీకి వచ్చే సూచనలు కనబడటం లేదంటూ పలువురు టాలీవుడ్ నేతలు ఎన్టీఆర్ అమిత్ షా భేటీ పై విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ ఎన్టీఆర్ పై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడమే కాకుండా ఎన్టీఆర్ ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.