బిగ్ న్యూస్ : పవన్ పార్టీలోకి ప్రముఖ నటుడు..చేరేది అప్పుడేనట.!

సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లినటువంటి ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అయితే ఎప్పుడో అంటే ఓ స్టార్ హీరో ఇలా పార్టీ పెట్టిన వెంటనే గెలిచేసే సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరేలా ఉన్నాయని చెప్పాలి.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు ఇప్పుడు ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఇప్పుడు పవన్ కేవలం రాజకీయాల్లో కూడా సినిమాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరి పవన్ సినిమాలు నుంచి వచ్చినా కూడా సినిమాల పరంగా అయితే తనకి ఎలాంటి సహకారం ఇండస్ట్రీ వర్గాల నుంచి రాలేదు. ఎక్కడో జబర్దస్త్ వాళ్ళు తన సినిమా అంత్యాక్షరి టీం వాళ్ళు తప్ప పెద్ద వ్యక్తులు పవన్ కి సపోర్ట్ ఇవ్వలేదు.

మరి అలాంటి వాటిలో స్టార్ నటుడు కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ కూడా ఒకరు. మరి తాను గతంలో ఓ పార్టీలో ఉండగా ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. అలాంటి తనకు ఇప్పుడు పవన్ జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా వెల్లడి చేశారు.

దీనితో ఈ న్యూస్ సినీ వర్గాలు సహా రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. తాను నిన్న నాగబాబు, ఇతర జనసేన ప్రముఖుల్ని కలిశానని పవన్ ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్నారని అందుకే అది అయ్యాక తమ పార్టీ అధ్యక్షుడు పవన్ సమక్షంలో చేరుతానని క్లారిటీ ఇచ్చారు.

అలాగే తాను ఏ పదవులు ఆశించడం లేదని స్వచ్చందంగా పవన్ పార్టీలో చేరుతున్నానని కష్టపడతానని తెలిపారు.