కమలం… కైండ్లీ రెస్పాండ్ ప్లీజ్!

ఏపీలో వేసవిని మించి వేడెక్కిపోతున్నాయి రాజకీయాలు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే… రోహిణీ కార్తి ఎండలను మించి మంటపుట్టిస్తున్నాయి. దానికి కారణం… ప్రధానంగా పవన్ చేస్తున్న కొత్త పొత్తుల రాజకీయం. బీజేపీని టీడీపీని ఎట్టిపరిస్థితుల్లో కలపాలని, వారితోపాటు తాను కలిసి నడవాలని పవన్ ప్లాన్ చేశారు. బీజేపీ అధిష్టాణానికి రిక్వస్ట్ లెటర్స్ రాస్తున్నారు. అయితే బీజేపీ నుంచి మాత్రం స్పందన రావడం లేదు.

2014 ఫలితాలు రిపీట్ చేయాలని.. అలా చేయాలంటే.. బీజేపీ టీడీపీలు కలవాలని బలంగా నమ్ముతున్నారు పవన్. అయితే బీజేపీలో ఒక వర్గం మాత్రం చంద్రబాబు పేరు చెబితే అంతెత్తున లేచి పడుతున్నారు. గతంలో పొత్తులు పెట్టుకుని ప్రయోజనం పొందేసిన తర్వాత చేయి వదిలేయడం.. వదిలితే వదిలారు.. “బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదం” లాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వడం చేసేవారు. దీంతో సీనియర్ బీజేపీ నేతలు కొందరు.. టీడీపీతో పొత్తు అని అంటే ఏమాత్రం అంగీకరించడం లేదంట.

పైగా మోడీని నోటికొచ్చినట్లు తిట్టి, రాళ్లు, చెప్పులూ వేయించిన బాబుతో చేయికలపడం కంటే నిస్సిగ్గు చర్య ఈ వయసులో మోడీకి మరొకటి ఉండదని మరికొందరు భావిస్తున్నారంట. ఫలితంగా… అలాంటి ఆలోచనలు మోడీ మనసులో లేవని, పవన్ లేఖలకు సరైన సమయంలో సరైన స్పందన ఉంటుందని చెబుతున్నారంట. అయితే… ఇప్పటికీ పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నారని.. 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన మాత్రమే కలిసి పోటీచేస్తాయని చెబుతున్నారు. తమను కాదని ఎన్నికలకు వెళ్తారని తాము భావించడం లేదని, పవన్ అంత సాహసం చేయరని వారు బలంగా నమ్ముతున్నారంట.

మరి బీజేపీ నేతలు భావిస్తున్నట్లు జనసేన + బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తాయా… లేక, పవన్ ఆశిస్తునంట్లు బీజేపీ + టీడిపీ + జనసేన కలిసి వెళ్తాయా.. లేకపోతే బీజేపీని ఎడమకాలితో తన్ని జనసేన + టీడీపీ కలిసి పోటిచేస్తాయా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా… రాబోయే ఎన్నికల్లో పవన్ ఎత్తిన ఈ పొత్తుల పాలిటిక్స్ ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది వేచి చూడాలి! ఏది ఏమైనా… బీజేపీలో పెద్ద నేతలు స్పందించి వారి అభిప్రాయన్ని చెబితే తప్ప సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏపీ జనాలది. సో… కమళం కైండ్లీ రెస్పాండి ప్లీజ్!