Chandra Babu: చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే: వైయస్ జగన్

Chandra Babu: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులతో గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతలతో జగన్ ముఖ్య విషయాలపై చర్చ జరిపారు. ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద లేదని జగన్ తెలిపారు. మన ప్రభుత్వ హయామంలో ప్రతి ఒక్క ఇంటికి మంచి చేశాము కానీ చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలను నమ్మిన ప్రజలు అంతకంటే మంచి చేస్తారని భావించి తనకు ఓట్లు వేసి గెలిపించారు.

చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీలను చూసిన మనవాళ్ళు ఎంతో మంది మనం కూడా ఇలాంటి హామీలను ఇద్దామని నాతో చెప్పారు కానీ శృతి మించిన హామీలను మనం ఎప్పుడు చేయమని ఇచ్చిన హామీని తూచా నెరవేరుస్తామని తెలిపారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించాము.కోవిడ్‌ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా, సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశాం. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించాం.

ఇలా ఇంత మంచి చేసిన ఒక పది శాతం మంది ప్రజలు చంద్రబాబు నాయుడు మాటలను నమ్మారని అందుకే గత ఎన్నికలలో మనం ఓడిపోయామని జగన్ తెలిపారు. ఇక ఆరు నెలలు కూడా గడపకు ముందే చంద్రబాబు నాయుడు మోసాలు బయటపడ్డాయి దీంతో రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పాలనపై వ్యతిరేకత వచ్చిందని జగన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు గురించి నేను గతంలోనే చెప్పాను ఆరు నెలలలోనే తన పట్ల వ్యతిరేకత వస్తుందని నేను చెప్పిన విధంగానే ప్రజలందరూ ఆయన తీరుపై వ్యతిరేకంగా ఉన్నారని జగన్ తెలిపారు.

చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని లేపడమేననీ, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబుగారు నిజం చేస్తున్నారంటూ ఈ సమావేశంలో చంద్రబాబు పాలన గురించి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.