టీడీపీలోకి బాలినేని.! డీల్ చాలా చాలా పెద్దదే.!

వైసీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రేపో మాపో అధికారిక ప్రకటన రానుంది. వైసీపీ నుంచి బుజ్జగింపులేమీ కనిపించడం లేదంటే, దానర్థం ఆయన పార్టీని మారినా తమకేం నష్టం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లైట్ తీసుకున్నట్లే.

2024 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓడిపోతారంటూ ‘ఐ-ప్యాక్’ ఇచ్చిన నివేదిక ఆధారంగానే, బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించారనే ప్రచారం గతంలో జరిగింది. ఆ తర్వాత బాలినేని ఇమేజ్ మరింతగా దిగజారిపోయిందంటూ వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది.

కాగా, వెళుతూ వెళుతూ వైసీపీకి మేగ్జిమమ్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో వున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటికే టీడీపీ అధినేతతో బాలినేని మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. ‘చాలా పెద్ద డీల్ సెట్ అయ్యింది.. తనతోపాటు బాలినేని మరికొందర్ని టీడీపీలోకి తీసుకెళ్ళబోతున్నారు’ అన్నది టీడీపీ వర్గాల్లో వినిపిస్తోన్న గుసగుసల సారాంశం.

చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా వైసీపీకి చెక్ పెడుతున్నారనీ, ముందు ముందు మరింత మంది వైసీపీ నేతలు టీడీపీలోకి వస్తారనీ ప్రచారం గట్టిగా జరుగుతోందిప్పుడు. అయితే, గతంలో ఇలాగే ఇతర పార్టీల నేతలకు గాలం వేసి, చంద్రబాబు సాధించిందేంటి.? అధికారంలో వుండే.. ఆ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు చంద్రబాబు.

కాగా, బాలినేని రాజకీయ జీవితానికి దాదాపు ముగింపు పడినట్లేనని అంటున్నారు ఆయన అనుచరులు.!