స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఏ సినిమా విడుదలైనా ఆ సినిమాలో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా డైలాగ్స్ ఉండాల్సిందే. ఈ విషయంలో బాలయ్య అస్సలు తగ్గడం లేదు. కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసినా బాలయ్య మాత్రం తన శైలిలో ముందుకు వెళుతున్నారు. అయితే ఈ డైలాగ్స్ వల్ల వీరసింహారెడ్డి సినిమాకు పాజిటివ్ కంటే నెగిటివ్ గానే ఎక్కువగా జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే బాలయ్య టీడీపీకి బెనిఫిట్ కలగాలని సినిమాలో ఈ డైలాగ్ లకు ప్రాధాన్యత ఇచ్చినా ఎక్కువమంది మాత్రం డైలాగ్స్ టీడీపీకి నెగిటివ్ చేశాయని చెబుతున్నారు. బాలయ్య రీల్ లైఫ్ లో డైలాగ్స్ చెప్పే బదులు రియల్ లైఫ్ లో సీఎం అయితే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య ఇలాంటి డైలాగ్ లను సినిమాల్లో పెట్టడం వల్ల వైసీపీ అభిమానులు బాలయ్య సినిమాలను చూడటం లేదు.
బాలయ్య అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు. వైసీపీ బాలయ్యను టార్గెట్ చేసి విమర్శలు చేసిన సందర్భాలు కూడా తక్కువనే సంగతి తెలిసిందే. హిందూపురంలో బాలయ్యను కచ్చితంగా ఓడించాలని వైసీపీ భావిస్తే హిందూపురంలో బాలయ్యకు ఓటమి తప్పదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య అందరివాడు అనిపించుకోవాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.
బాలయ్యను టార్గెట్ చేస్తూ ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి ఘాటు కౌంటర్లు వస్తున్నాయి. బాలయ్య కొన్ని విషయాలలో చంద్రబాబును సమర్థించడం కూడా ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అలాంటి వ్యక్తికి అనుకూలంగా ప్రతి సందర్భంలో వ్యవహరించడం వల్ల నష్టం కలిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.