ఇలా వచ్చి, అలా వెళ్ళి.. వైసీపీకి మేలు చేసిన బాలయ్య

Balakrishna's favor for YCP

‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాకు వీరాభిమాని..’ అని కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నారు నందమూరి బాలక్రిష్ణ. అది నిజమే కూడా. ఈ మేరకు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ పేరుతో ఒకప్పుడు పెట్టిన బ్యానర్లు, కటౌట్లు దర్శనమిస్తాయి. ఆ సంగతి పక్కన పెట్టి, అసలు విషయానికొస్తే, ఇటీవల బాలయ్య తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ కొంత హంగామా చేశారు. ఈ క్రమంలో బాలయ్య నోట కొన్ని తప్పులూ దొర్లాయి. ప్రత్యేక హోదా అనబోయి, ప్రత్యేక రాష్ట్రం అన్నారు బాలయ్య. ఇలాంటి కామెడీలు చాలానే పండించారు. కొన్ని ఈక్వేషన్స్ చివరి నిమిషంలో మారిపోవడంతో బాలయ్య, హిందూపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. లేదంటే, అనంతపురం జిల్లాలో కనిపించిన వైసీపీ వేవ్ నేపథ్యంలో బాలయ్య కూడా ఓడిపోయి వుండాలి.

Balakrishna's favor for YCP
Balakrishna’s favor for YCP

ఇక బాలయ్య హిందూపూర్ సందర్శన, వైసీపీకి మేలు చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. లోకేష్ ఎలాగో, బాలయ్య కూడా అలాగే. బాలయ్యతో పోల్చితే లోకేష్ ఇంకాస్త బెటర్. ఔను, లోకేష్ చర్యల కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అడ్వాంటేజ్ పెరుగుతున్న వైనం చాలాకాలంగా చూస్తున్నాం. బాలయ్య విషయంలోనూ అదే జరుగుతోంది.

లోకేష్ అమాయకత్వం టీడీపీకి శాపం. బాలయ్య అత్యుత్సాహం అంతకన్నా శాపం.. అని టీడీపీ అభిమానులే సోషల్ మీడియా వేదికగా వాపోతోంటే, వైసీపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. కాగా, మంత్రి కొడాలి నానికి బాలయ్య సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ టీడీపీ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తోంటే, దీన్ని వార్నింగ్ అనగలమా.? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఓ ఎమ్మెల్యేగా నందమూరి బాలయ్య, అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీయలేకపోతున్నారు. చంద్రబాబు గోల చేస్తే, అది కామన్.. చాలా చిన్న విషయం అయిపోయింది. అదే, బాలయ్య గనుక వైసీపీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడితే, ఆ కిక్ ఇంకోలా వుండేది. కానీ, బాలయ్య నుంచి అలాంటివి ఆశించలేం.