‘అఖండ’ సినిమా కోసం నేరుగా నందమూరి బాలకృష్ణ అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ వ్యవహారాలు చూస్తోన్న మంత్రి పేర్ని నానితో మాట్లాడారట. ఆ విషయాన్ని పేర్ని నాని స్వయంగా వెల్లడించారు. ‘అవసరమైన రీతిలో సానుకూలంగా స్పందించండి’ అని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పట్లో, బాలయ్య ఫోన్ కాల్ విషయమై మంత్రి పేర్ని నానికి సూచించారట.
అలాంటప్పుడు, సినిమాల్లో రాజకీయాలు చొప్పించడం ఎందుకు.? ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని కొన్ని డైలాగులు, రాజకీయ కోణంలో రాయబడ్డాయి. అది కూడా వైఎస్ జగన్ సర్కారుని టార్గెట్ చేసేలా వున్నాయి. వీటికి టీడీపీ ఇస్తోన్న ఎలివేషన్లు ఓ రేంజ్‌లో వుంటున్నాయ్.
సినిమా విడుదల రోజున థియేటర్లలో నానా హంగామా నడిచింది. అందులో రాజకీయ హంగామా వేరే లెవల్. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాలయ్య అభిమానులైన టీడీపీ కార్యకర్తలు నినదించారు. ఇవే కదా, సినిమా పరిశ్రమని ఇబ్బందుల్లోకి నెట్టేసేది.?
సినిమాని సినిమాగా తీస్తే.. ఆ సినిమాని సినిమాగా చూస్తే.. ఎవరికీ ఎలాంటి సమస్యలూ వుండవు. వైసీపీ – టీడీపీ కార్యకర్తల మధ్య గలాటాకి ఇలాంటి వ్యవహారాలు తావిస్తాయి. కానీ, బావ మెప్పు కోసమో.. లేదంటే, బావకి సాయం చేసేందుకో.. బాలయ్య కూడా, తన సినిమాల్లో రాజకీయాల్ని జొప్పించకుండా వుండలేకపోతున్నారు.
‘వీరసింహారెడ్డి’ ఎపెక్ట్ ఖచ్చితంగా ముందు ముందు బాలయ్య సినిమాల మీద రాజకీయంగా పడే అవకాశమైతే లేకపోలేదు. ‘వీర సింహా రెడ్డి’ మీద కూడా పొలిటికల్ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది.