బుద్ధి మార్చుకోవయ్యా బాలయ్యా.. పార్టీ పరువు, ఫ్యామిలీ పరువు పోతుందిగా?

Nandamuri-Balakrishna-Allu-Aravind

మన మనస్సులో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా పబ్లిక్ లో మాట్లాడే సమయంలో హుందాగా మాట్లాడాలి. సినిమా సెలబ్రిటీలలో చాలామంది ఇదే నియమాన్ని ఫాలో అవుతారు. అయితే బాలయ్య మాత్రం అందరు హీరోలకు భిన్నం అనే సంగతి తెలిసిందే. నోటికి ఏ మాట వస్తే ఆయన అదే మాట మాట్లాడతారు. కొంతమంది బాలయ్యను ఈ విషయంలో విమర్శించినా ఆ కామెంట్లను సైతం బాలయ్య పట్టించుకోరు.

అయితే బాలయ్య బుద్ధి మార్చుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయన కామెంట్ల వల్ల పార్టీ పరువు పోవడంతో పాటు ఫ్యామిలీ పరువు పోతుందని అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి. గొప్పవాళ్ల కడుపున గొప్పవాళ్లే పుడతారని అయితే వాళ్ల ప్రవర్తన కూడా గొప్పగా ఉండాలని సీనియర్ ఎన్టీఆర్ కొడుకైన బాలయ్య తండ్రి పేరు, పరువు ప్రతిష్టలను నిలబెట్టాలే తప్ప ఈ విధంగా చేయడం సరికాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య ప్రవర్తన వల్ల ఆయనతో షో చేసే నిర్వాహకులతో పాటు ఆయనతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు సైతం ఒకింత టెన్షన్ పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎంత వ్యతిరేకత వస్తున్నా బాలయ్య వెనక్కు తగ్గకపోవడం గురించి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. బాలయ్య మాటల వల్ల లోకేశ్ పాదయాత్రకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాలయ్య ఎప్పటికి మారతారో అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారంటే కారణం ఇదేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య మంచి హీరో అని మంచి మనిషి అని అయితే కొన్ని చిన్నచిన్న తప్పుల వల్ల బాలయ్య పరువు పోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.