విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రజల్లో ఎంతో మంచి అభిప్రాయం ఉందనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయసహకారాలు అందితే మాత్రం ప్రైవేట్ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్ అడుగులు పడటానికి ఎంతోకాలం పట్టదని చెప్పవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీలోని రాజకీయ పార్టీలు అన్నీ చేతులెత్తేశాయని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
బీజేపీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ అడుగులు వేసే సాహసం చేయదు. జనసేన బీజేపీ మధ్య పొత్తు ఉన్నా బీజేపీని నిలదీసే శక్తి పవన్ కళ్యాణ్ కు లేదు. బీజేపీతో పెట్టుకుంటే తమ పార్టీకి భవిష్యత్తు ఉండదని టీడీపీ ఫిక్స్ అయింది. వేర్వేరు కారణాల వల్ల ప్రైవేట్ దిశగా స్టీల్ ప్లాంట్ అడుగులు పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఏపీ పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఇతర పార్టీలకు శాపం అవుతున్నాయి.
ఏపీ రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా చేతులెత్తేశాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్న స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఏపీ రాజకీయ పార్టీలు ఎలా సమర్థించుకున్నా ఈ విషయంలో ఊహించని స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగంగా పడుతున్న నేపథ్యంలో ఏం జరగనుందో చూడాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయిలో ప్రైవేట్ పరం అయిన తర్వాత ఉద్యోగులు ఏం చేసినా పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ వెనుకడుగు వేసే పరిస్థితులు అయితే కనిపించడం లేదు.