తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మీదా, తెలంగాణ మంత్రి హరీష్ రావు మీదా ఒకింత గట్టిగానే నోరు పారేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజు. పైగా, ‘ఆంధ్రోళ్ళు లేకపోతే, హైద్రాబాద్‌లో అడుక్కు తినాలి..’ అంటూ ఘాటైన వ్యాఖ్యలూ చేశారాయన. నిజానికి, వైసీపీ నేతల నుంచి ఇలాంటి మాటలు రావడంలో వింతేమీ లేదు. బూతు పండితులు కూడా వున్నారు. అయితే, ఈసారి ఏపీ వైసీపీ నేతలు తిట్టింది గులాబీ పార్టీ నేతల్ని. బీఆర్ఎస్ నేతలపై ఈ స్థాయిలో వైసీపీ నేతలు విమర్శలు చేయడం అనేది చాలా అరుదైన సందర్భం.
https://youtu.be/y91koxoO0oY
ఏం జరిగిందోగానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి, సీదిరి అప్పలరాజుకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని చెప్పుకొచ్చారు. అంతలా సీదిరి అప్పలరాజుకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది.? రాజకీయాల్లో విమర్శలు మామూలే. పైగా, హరీష్ రావుతోపాటు చాలామంది గులాబీ పార్టీ నేతలు, ఏపీలోని వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారాయె. ఈ నేపథ్యంలోనే సీదిరి అప్పలరాజు ఒకింత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహా కొందరు వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినా, వారెవరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వార్నింగ్ ఇవ్వలేదట. అంటే, సీదిరి మీద.. వైఎస్ జగన్.. వేరే విషయంలో అసహనంతో వుండి, ఇలా ఝలక్ ఇచ్చారని అనుకోవాలేమో.!