ఏంటీ… ఆ ఏపీ మంత్రికి అంతమంది బినామీలు ఉన్నారా? గుట్టు రట్టయింది.

Ysrcp

ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన భూములను తప్పుడు పత్రాలు సమర్పించి తన బంధువులు, బినామీల పేరిట మంత్రి జయరాం రాయించుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

ayyanna paatrudu allegations on AP minister jayaram
ayyanna paatrudu allegations on AP minister jayaram

దీనికి సంబంధించిన వివరాలను విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. సదరు ప్రైవేటు సంస్థ నుంచి 2009లోనే బయటకొచ్చిన మంజునాథ్‌ అనే వ్యక్తి తప్పుడు పవర్‌ ఆఫ్‌ అటార్నీ పత్రాలు సమర్పించి వందల ఎకరాల భూమిని అతని పేరు మీద రాయించుకుని, ఆ తర్వాత మంత్రి బంధువులకు విక్రయించారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

ayyanna paatrudu allegations on AP minister jayaram
ayyanna paatrudu allegations on AP minister jayaram

ఆ భూమిపై కర్నూలు జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంకులో రుణం పొందేందుకు యత్నించారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కర్ణాటకలో కూడా కేసు నమోదైందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై కోర్టులో కేసు ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి జయరాం భూ దందాకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రైవేటు కంపెనీ నుంచి మంత్రి జయరాం భూములు లాక్కున్నట్టు తన వద్ద ఆధారాలు ఉన్నాయని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి పలు పత్రాలు చూపించారు.