కర్నూలులో ఏఎస్ఐ హల్చల్.. తప్పతాగి రోడ్డుపై దొర్లుతూ రచ్చ…. మండిపడుతున్న స్థానికులు!

మనదేశంలో పోలీస్ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఉంది. పోలీస్ ఉద్యోగం అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్న పని. ఎంతోమంది యువకులు పోలీసు ఉద్యోగంలో చేరి సమాజానికి సేవ చేయాలని భావిస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న ప్రజలను రక్షించడమే వారి ధ్యేయంగా పోలీసులు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. అందువల్ల తప్పు చేసిన వారిని తల్లి తండ్రి తర్వాత శిక్షించే బాధ్యత కేవలం పోలీసులకే ఉంది. గౌరవమైన వృత్తిలో ఉంటూ కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. గౌరవమైన పోలీస్ వృత్తిలో ఉంటూ కొందరు లంచాలకు ఆశపడుతూ అమాయకులను శిక్షిస్తుంటే మరి కొంతమంది ప్రజలు చేసే తప్పులను సరిదిద్దకుండా వారే తప్పులు చేస్తున్నారు.

తాజాగా కర్నూలు జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. మద్యపానం సేవించటం చట్టరీత్య నేరం. మద్యపానం సేవించి రోడ్డుపై తిరగటం వాహనాలు నడపటం నేరంగా భావించి వారిని శిక్షిస్తూ ఉంటారు. ఇలా మద్యపానం సేవించి రోడ్డుపై హల్చల్ చేసే వారిని శిక్షించే స్థానంలో ఉన్న పోలీస్ ఉద్యోగి పట్టపగలు పీకల్లోతూ మద్యం సేవించి రోడ్డుపై హల్ చల్ చేసిన ఘటన స్థానికులను షాక్ కి గురిచేసింది. వివరాలలోకి వెళితే.. కర్నూలు నగరానికి చెందిన ఒక ఏఎస్ఐ డ్యూటీలో ఉండగా యూనిఫామ్ ధరించి మరి పీకల్లోతు మద్యం సేవించి పట్టపగలే నడిరోడ్డుపై నడవలేని స్థితిలో తూలుతూ పడిపోయాడు.

మద్యం తాగి మతిస్థిమితం లేని స్థితిలో ఉన్న ఏఎస్ఐని స్థానికులు వారి సహాయంతో రోడ్డు పక్కన వదిలేయక అతను అడుగు కూడా వేయలేక అక్కడే పడిపోయాడు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న 3వ పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐని అక్కడినుంచి తీసుకెళ్లారు. అయితే ప్రజలకు బుద్ధి చెప్పాల్సిన పోలీసులే ఇలా పట్టపగలు మద్యం తాగి హల్చల్ చేయటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన మరొకటి జరగకుండా ఉండాలంటే ఏఎస్ఐ ని శిక్షించాలని.. వెంటనే అతనిని విధుల నుండి తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.