పవన్ గాలి తీసిన అసదుద్ధీన్… బాబు – జగన్ పై కీలక వ్యాఖ్యలు!

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు అనంతరం ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబుతో ములాకత్ అయిన పవన్ కల్యాణ్… వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసే పోటీచేస్తాయని తెలిపారు. దీంతో… ములాకత్ పేరుచెప్పి మిలాకత్ అయ్యారంటూ వైసీపీ నేతలు విమర్శించారు.

మరోపక్క అధికార వైసీపీ నేతలు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం టీడీపీ పరిస్థితి.. గాలివానలో పడవ ప్రయాణంలా మారిందని నమ్ముతుంది. మరోపక్క లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు, తాజా పరిస్థితులపై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసీ స్పందించారు.

తాజాగా తన పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన అసదుద్ధీన్ ఒవైసీ… ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలు, చంద్రబాబు అరెస్ట్, జగన్ పాలన, ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితిపై స్పందించారు. ఇందులో భాగంగా… ఏపీలో ఉన్నవి రేండే పార్టీలని.. అవి ఒకటి టీడీపీ కాగా, మరొకటి వైసీపీ అని అన్నారు. దీంతో జనసేనను ఒవైసీ పరిగణలోకి తీసుకోలేదా అనే చర్చ మొదలైంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన ను ఒవైసీ అలా గడ్డిపరకలా తీసిపారేయడంపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ పీఅ ఒవైసీ స్పందించారు. ఇందులో భాగంగా… చంద్రుడు ఆంధ్రప్రదేశ్‌ లోని జైల్లో చాలా హ్యాపీగా ఉన్నాడని, ఆయన జైలుకు ఎందుకు వెళ్లారో మీ అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

ఇదే క్రమంలో… జగన్ పాలనపైనా ఒవైసీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనపై స్పందించిన అసదుద్ధీన్ ఒవైసీ… మంచి పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. అయితే… చంద్రబాబును మాత్రం ఎప్పటికీ నమ్మలేమని చెప్పిన ఆయన… ప్రజలు కూడా ఆయన్ని ఎప్పుడూ నమ్మొద్దంటూ కోరారు. దీంతో ఇప్పుడు ఒవైసీ తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!