ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిపక్షం టీడీపీతో కలిసి రాజకీయాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మరీ టీడీపీకి లొంగిపోకుండా… అలాగని నేను మీవాడిని కాదు అనిపించుకోకుండా తెలివిగా వ్యాఖ్యానించడం ఆయనకు బాగా తెలుసు. దీనిలో భాగంగా జగన్ సర్కార్ పై ఎప్పటికప్పుడు విషం చిమ్మడం… నిప్పులు చేరగడం ఆయనకి తొలి నుంచి ఓ అలవాటుగా మారిపోయింది. ఏపీలో మిగతా బీజేపీ నేతలంతా జగన పాలనను మెచ్చుకుంటుంటే? ఆయనొక్కడే పనిగట్టుకుని జగన్ పై విషం చిమ్ముతుంటాడు. తాజాగా మరోసారి కన్నా అదే పని చేసాడు. కన్నా కోడలు చనిపోయి 11 రోజుల కార్యక్రమం కూడా పూర్తి కాకుండా జగన్ ని విమర్శించడానికి నేను అనేవాడిని ఒకడిని ఉన్నానంటూ దూసుకొచ్చాడని తాజాగా ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
జగన్కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదంట. తక్షణమే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలంట. ప్రజలు నమ్మి ఓటేస్తే ఇప్పుడు జగన్ అసలు రూపం చూపిస్తున్నాడంటూ ఆరోపించారు. అనుభవరాహిత్యం, అసమర్ధ పాలన, క్షక్షసాధింపు, అహంకారం, ఆత్రం, అప్పులు, అవినీతి, రివర్స్ అంటూ విమర్శలు చేసే ప్రయత్నం చేసారు. అయితే ఇప్పటివరకూ కన్నా ఇంతగా ప్రభుత్వంపై పెట్రోగిపోలేదు. ఇలా చేయడం ఇదే తొలిసారి. మరి ఇంతగా అసహనాన్ని వెళ్లగక్కడానికి కారణం ఏంటి? అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్ డీ ప్రభుత్వం జగన్ ఏడాది పాలనను మెచ్చుకోవడం ఆయనకు నచ్చకే ఇలా దాడి చేసాడని వైకాపా నేతలు మండిపడుతున్నారు.
ఆయన ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడం..తగినంత ప్రచారం రాకపోవడంతోనే ఇలా అర్ధం లేని వ్యాఖ్యలతో మైలేజ్ కోసం చేసారంటున్నారు. కనీసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జాతీయ మీడియా అటెన్షన్ లేకపోయినా…తెలుగు మీడియా అయినా ఆయన్ని పట్టించుకుంటుందనే ఇలా నోరు జారడని వైకాపా వర్గం అంటోంది. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే ఉన్న సీటు కూడా ఊడిపోద్దని ఎద్దేవా చేసారు. ఆ సమమం దగ్గరపడిందని మండిపడ్డారు. అయితే పచ్చ మీడియా మాత్రం కన్నా వ్యాఖ్యల్ని బాగానే ప్రమోట్ చేస్తోంది.