ఉచిత పథకాలు ముఖ్యమా? అభివృద్ధి ముఖ్యమా? జగన్ ఆలోచించాల్సిందే!

YS_Jagan_Mohan_Reddy__India_To

దేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కాని స్థాయిలో ఏపీ ఫ్రీ స్కీమ్స్ అమలవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం జగన్ సర్కార్ ఫ్రీ స్కీమ్స్ వల్ల భారీ స్థాయిలో లబ్ధి పొందుతోంది. అయితే ఈ ఉచిత పథకాల వల్ల పార్టీకి మేలు జరుగుతోందా? కీడు జరుగుతోందా? అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రజల్లోకి రాకపోవడం వల్ల కూడా ప్రజల సమస్యలు ఆయనకు పూర్తిస్థాయిలో తెలియడం లేదు.

ఏపీలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగకపోవడం కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను ఎంతగానో బాధ పెడుతోందని తెలుస్తోంది. జగన్ పథకాలను గుడ్డిగా నమ్మి ప్రజల్లోకి వెళుతున్నారని అయితే ప్రజల్లోని వ్యతిరేకతను గమనించి ఆ వ్యతిరేకతను అధిగమించే విషయంలో మాత్రం తప్పటడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఉచిత పథకాలతో పాటు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాల్సిన బాధ్యత జగన్ సర్కార్ పై ఉంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా పొరపాట్లు చేసినా దాని ఫలితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, జనసేన చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు జగన్ స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రోడ్ల విషయంలో ఎదురవుతున్న విమర్శలకు చెక్ పెడుతూ ముందడుగులు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

జగన్ సర్కార్ ఎన్నికలకు సంబంధించి యాక్టివ్ గా లేని ఎమ్మెల్యేల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పని చేయని ఎమ్మెల్యేల విషయంలో జగన్ కఠినంగా ఉండాలి. జగన్ సర్కార్ చేస్తున్న పొరపాట్లు చిన్న పొరపాట్లు అయితే కాదు. జగన్ సర్కార్ సంచలనాలు సృష్టించాల్సి ఉంది.