AP: పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాబట్టబోతుందని తెలుస్తోంది. ఇప్పటికైతే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పే కొన్ని డైలాగులు కూటమి నేతలను అలాగే పవన్ కళ్యాణ్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ చెప్పారు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ డైలాగులు ఎక్కడ అంటూ కూటమి నేతలు ఈ తప్పుడు పిచ్చి ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు.
కొంతమంది వైకాపా కార్యకర్తలు అల్లు అర్జున్ సినిమాని అలుసగా చేసుకొని కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు. పుష్ప సినిమాలో స్నేహం కోసం ఎక్కడికైనా వెళ్తానని నా స్నేహితుడి కోసం నేను వస్తే అడ్డుకోవడం నీ బాబు కాదు కదా మీ బాబాయి వచ్చిన అడ్డుకోలేరు అనే డైలాగ్ తో పాటు ఎవడ్రా బాసు ఆడికి వాడి కొడుకు వాడి తమ్ముడికి కూడా నేనే బాస్ అనే డైలాగ్స్ పెట్టారంటూ సోషల్ మీడియాలో ఈ డైలాగులను వైరల్ చేస్తున్నారు.
అయితే సినిమాలో ఈ డైలాగులు ఎక్కడా లేవని ఇదంతా కూడా వైసీపీ ఫేక్ ప్రచారం అంటూ కూటమినేతలు కూడా ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.ఇక పుష్ప 2 సినిమాలో ఎలాంటి పొలిటికల్ డైలాగ్ లు ఇంటెన్షన్లు లేవు .. అలాంటివి పెట్టాలని కూడా అనుకోలేదని సులువుగా అర్థం అవుతుంది .. ఆ మాటకు వస్తే నిజంగా గాజు గ్లాస్ తో అర్జున్ చేసిన డాన్స్ జనసేనకు డైరక్ట్ గా సపోర్టు చేసినట్లే అవుతుంది. దాన్ని పట్టించుకోకుండా.. సోషల్ మీడియాలో ఎందుకు ఇంత ఫేక్ ప్రచారం చేస్తున్నారో అర్థం కాని విషయం అని చెప్పాలి.