AP: టీడీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో యనమల… సంచలనంగా మారిన లేఖ!

AP: అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా అంటే అవును అనే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో కీలక ప్రాధాన్యత పోషించిన యనమల రామకృష్ణుడు ప్రస్తుతం ఈ పార్టీ పై ఆరోపణలు చేయడంతో ఈయన ఈ పార్టీ నుంచి తప్పుకుంటారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. రామకృష్ణుడు రాసిన లేఖ తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే కాకుండా ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. యనమల బీసీ కార్డు కూడా ఉపయోగించడం వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.

కాకినాడ సెజ్ పేరుతో బీసీల సాగులో వున్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వ లాక్కొని ఒక సామాజికవర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసిందని యనమల ఆరోపించారు. కేవీ రావు అంటే చంద్రబాబుకు చెందిన కమ్మ సామాజికవర్గమే. ఈయన ఏకంగా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని కూడా ప్రశ్నిస్తే ఓపెన్ అయ్యారని తెలుస్తుంది. ఇలా ఈ లేఖలో రాసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈయన ఈ పార్టీకి దూరం కాబోతున్నారని తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి క్యాబినెట్లో మంత్రి హోదా పొందారు పార్టీ గుట్టు మొత్తం చంద్రబాబుతో పాటు తెలిసిన వ్యక్తులలో ఎనమల రామకృష్ణుడు కూడా ఒకరు. అయితే ఈ ఎన్నికలలో ఈయనకు టికెట్ ఇవ్వలేదు కానీ ఈయన కూతురు అల్లుడు అలాగే తన బియ్యం గుడికి కూడా టికెట్లు ఇచ్చారు. ప్రస్తుతం వీరంతా కూడా పదవులలో ఉన్నారు ఇక ఎమ్మెల్సీగా యనమల రామకృష్ణుడు కూడా ప్రస్తుతం పదవిలో ఉన్నారు.

ఇలా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడుకు ఈసారి బాబు కేబినెట్లో చోటు దక్కలేదు ఆ విషయంలో యనమల రామకృష్ణుడు అలిగారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ నుంచి దూరం అవ్వడం గురించి ఆలోచనలు చేయడమే కాకుండా సన్నిహితుల దగ్గర ఇదే విషయం గురించి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మరి ఎనమల రామకృష్ణుడు పార్టీ మారడం గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.