AP: నిధులు లేవంటూ కాలయాపన చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్!

AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 6 నెలలు దాటిపోతుంది ఇప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక పోతుంది అంటూ వైకాపా నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆంజాద్ బాషా కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న ఇప్పటివరకు ఏ విధమైనటువంటి హామీలను నెరవేర్చలేదని తెలిపారు. నిధులు లేవు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించకుండా నిత్యం ఏదో ఒక రాజకీయ కుట్రలకు కారణమవుతూ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.

రాజ్యాంగబద్ధంగా 2023లో జీవో 47 కింద వక్ఫ్ బోర్డు నియామకం చేశాం. దాన్ని నిన్న ఆ జీవోను ఉపసంహరించుకోవడం దుర్మార్గం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో రిట్లను ఉపసంహరించుకోవాలి కానీ బోర్డు రద్దు చేయడం ఏమిటి?. 2014-19 మధ్యలో చంద్రబాబు అసలు వక్ఫ్ బోర్డు వేయనే లేదు. 2018లో చంద్రబాబు కమిటీ వేస్తే దాని కాలం 2023 వరకూ ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బోర్డును రద్దు చేయలేదని తెలిపారు.

వక్ఫ్ ఆస్తులకు అన్యాక్రాంతం చేసేందుకే ఈ చట్టం తెస్తున్నారు. దీనివల్ల ముస్లింల హక్కులు దెబ్బతింటున్నాయి. అందుకే వైసీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంది. జమాతే ముస్లిం నేతలు కూడా జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జీవో 47 రద్దుపై మేము కచ్చితంగా చట్టప్రకారం పోరాడతామని అంజద్ భాష తెలిపారు. ఇలా కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన ఎన్నో గొప్ప పథకాలను అలాగే నిర్ణయాలను కూడా రద్దు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.