తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. జగన్ కూడా అదే దిశగా అడుగులు వేస్తారా?

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు పడుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాదే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో తెలంగాణలో ఎన్నికల ఫలితల్లో మార్పు లేకపోవచ్చు.

అయితే ఎక్కువ సంఖ్యలో పార్టీలు పోటీ చేస్తుండటంతో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ కూడా ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉంది. జగన్ అమలు చేస్తున్న పలు పథకాలు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అమలు అవుతున్నాయి. ఎక్కువ సంవత్సరాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది.

టీడీపీ, జనసేన ప్రస్తుతం యాక్టివ్ గా రాజకీయాలు చేయడం లేదు. అందువల్ల ముందస్తు ఎన్నికలకు వెళితే జగన్ సర్కార్ ఇతర పార్టీలకు గట్టి షాక్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ సమయానికి ఎన్నికలు జరిగేలా సీఎం జగన్ ప్లాన్ చేసుకుంటే మంచిది. పలు ఏరియాలలో జనసేనతో పొత్తు లేకుండానే టీడీపీ మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి.

జగన్ సలహాదారుల సలహాలు విని ముందుకెళ్లకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సీఎం జగన్ పథకాలను నమ్ముకుని ముందుకెళుతున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.