“ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, చేసిన వాగ్ధానాలకు, ఇచ్చిన హామీలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు, చెబుతున్న కబుర్లకు, తీసుకుంటున్న నిర్ణయాలకు ఏమైనా పొంతన ఉందా…?” ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ల గురించి ఏపీలోని ప్రజానికం మధ్య జరుగుతున్న చర్చ ఇది.
ఒకటి అంటే.. ఏదోలే అనుకోవచ్చు, రెండు అయితే.. తప్పని పరిస్థితుల్లో అని భావించొచ్చు. కానీ… అసలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, కుర్చీ ఎక్కిన తర్వాత చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతనలేకుండా చంద్రబాబు పరిపాలన ఉందని.. ఈ వయసులో కూడా ఇలాంటి రాజకీయాలు, మోసపూరిత వాగ్ధానాలు చేస్తారని అనుకోలేదంటూ కూటమికి ఓటేసినవారు భావిస్తున్నారని చెబుతున్నారు!
ఇప్పటికే తమ తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్న తల్లులు ఎన్నో ఆశలు పెట్టుకున్న “తల్లికి వందనం” హామీకి శఠగోపం పెట్టగా.. సూపర్ సిక్స్ హామీలపై నోరు మెదపని పరిస్థితి! పైగా… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుందంటూ సన్నాయి నొక్కులు బోనస్!! ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10,000 వేతనం ఇస్తామంటూ చెప్పి, ఇప్పుడు అసలు ఆ వ్యవస్థే లేకుండా చేస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.
ఏపీలో వాలంటీర్లు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. జగన్ అధికారంలో ఉన్నంతకాలం పెన్షన్లు ఇంటింటికీ తీసుకెళ్లి ఇవ్వాలనే బృహత్తర ఆలోచనను అమలులో పెట్టడం కోసం వీరి నియామకం జరిగిందని అంటారు. ఇక రేషన్ సరుకులు నుంచి ప్రతీ సంక్షేమ పథకం విషయంలో ప్రజలకు – ప్రభుత్వానికి వారదులుగా వీరు పనిచేశారు.
ఈ సమయంలో… సంక్షేమ పథకాలు అందుకునేవారు వీరిని చాలా గౌరవంగా చూడగా.. కొంతమంది మాత్రం గోనె సంచులు మోసే ఉద్యోగం అని, ఏపీలో మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ లో వీరి పాత్ర కూడా ఉందంటూ మరొకరు బురద జల్లారు! అక్కడ మొదలైన వ్యవహారం కాస్తా… ఎన్నికల నాటికి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాలు ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామంటూ హామీలు ఇచ్చేవరకూ వచ్చింది.
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల ప్రస్థావన పెద్దగా తెరపైకి రాలేదు. అయితే అనూహ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ తాజాగా వెల్లడించిన విషయాలతో ఈ వాలంటీర్ వ్యవస్థ మరోసారి చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో… ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నవారిలో కొంతమంది.. ఇది చంద్రబాబు స్క్రిప్ట్ లో భాగమా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
తాజాగా మైకులముందుకు వచ్చిన రాజేంద్రప్రసాద్… ఏపీలో రాష్ట్ర సర్పంచుల సంఘం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు! ఇందులో భాగంగా… గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచుల సంఘం తీర్మానించిందని అన్నారు. ఈ తీర్మానలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లకు అందచేస్తున్నట్లు వెల్లడించారు!! దీంతో… చంద్రబాబు, సర్పంచుల సంఘం భూజంపై తుపాకీ పెట్టి వాలంటీర్లను కాలుస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
దీంతో… ఈ సర్పంచుల సంఘం తీర్మానాన్ని చూపిస్తూ ఏపీలో వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఇదే సమయంలో… వాలంటీర్ల విషయంలో ప్రభుత్వానికి మరో ఉద్దేశ్యం లేదని.. వారి అవసరం తమకు లేదన్నట్లుగానే ప్రభుత్వం ఆలోచిస్తుందని.. ఇక వారికి రూ.10,000 జీతం అన్నది ఎలక్షన్ స్టంటే తప్ప మరొకటి కాదని చెబుతున్నారు!
ఇదే సమయంలో… చంద్రబాబు, సర్పంచుల సంఘం భూజంపై తుపాకీ పెట్టి వాలంటీర్లను కాలుస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సీఎంవోలో చర్చ జరుగుతుందని తెలుస్తోంది!