ఏపీ పదో తరగతి షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సంవత్సరం పరీక్షలకు మొత్తం 6.10 లక్షల మంది విద్యార్దులు దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 2833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 వరకు ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. విద్యార్ధులు ఆన్ లైన్ ద్వారా కూడా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.
ఫీజుల పేరిట విద్యార్దులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధించే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆన్ లైన్ ద్వారా తీసుకున్న హాల్ టికెట్లతో కూడా పరీక్షలు రాయవచ్చన్నారు. పరీక్షలను ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.15 నిమిషాల వరకు నిర్వహిస్తామన్నారు.
పరీక్షల షెడ్యూల్ వివరాలు ఇదే…
18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1
19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2
20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1
23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2
25/03/2019, మ్యాథ్స్ పేపర్-1
26/03/2019, మ్యాథ్స్ పేపర్-2
27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1
28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2
29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1
30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2