ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఏకంగా 20 జాబ్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతోంది. ఏకంగా 20 జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేయడానికి జగన్ సర్కార్ సిద్ధమవుతోందని సమాచారం అందుతోంది. గ్రూప్1, గ్రూప్2 తో పాటు ఇతర జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేయడానికి జగన్ సర్కార్ సిద్ధమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాబోయే మూడు నెలల్లో భారీ జాబ్ నోటిఫికేషన్ల దిశగా అడుగులు పడుతుండగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ నెలాఖరు సమయానికి 111 గ్రూప్1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. మరికొన్ని రోజుల్లో గ్రూప్4 ఫలితాలు విడుదల కానున్నాయని బోగట్టా. ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే.

ఎన్నికల సమయానికి భారీగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. గ్రూప్2 ఉద్యోగ ఖాళీల సంఖ్య 140 అని తెలుస్తోంది. జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ విడుదల చేస్తున్న జాబ్ నోటిఫికేషన్లకు వేతనాలు సైతం భారీ రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తోంది.

నిరుద్యోగుల మెప్పు పొందితే 2024 ఎన్నికల్లో విజయం సాధించడం నల్లేరు మీద నడక అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ సర్కార్ పై ప్రజల్లో అనుకూలత ఏ స్థాయిలో ఉందో వ్యతిరేకత అదే స్థాయిలో ఉంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందో చూడాల్సి ఉంది.