ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా ఇదే చర్చ తెరపైకి వస్తోంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు ప్రజలు ఎంతో అట్రాక్ట్ అయ్యారు. వేలకు వేలు మెజారిటీతో కూటమి నేతలను గెలిపించారు. ఫలితంగా జూన్ 12 ఏపీలో కూటమి ప్రభుతం కొలువుదీరింది. అంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి రెండు నెలలు కావొస్తుంది. అయితే… సంక్షేమ పథకాల ఊసు మాత్రం ఎత్తడం లేదు.
స్కూల్స్ స్టార్ట్ అయిన అనంతరం తల్లికి వందనం “నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు..” డిస్కషన్ పీక్స్ కి చేరింది. ఈ డైలాగ్ పై ట్రోలింగ్స్ పీక్స్ కి చేరుతున్నాయి. ఈ విషయంలో కూటమి కార్యకర్తలు కూడా బాధితులుగా మిగలడంతో వారు కక్కలేక మింగలేక నానా యాతన పడుతున్న పరిస్థితి. ఈ సమయంలో శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చేశారు.
ఇందులో భాగంగా… ఈ ఏడాదికి తల్లికి వందనం లేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందనే విషయంపై చర్చ జరగాలని లోకేష్ లాజిల్ లేని రీజన్ చెప్పారు. ప్రతీ ప్రభుత్వ ఉపాధ్యాయుడూ తన పిల్లలను పాఠశాలల్లోనే జాయిన్ చేయాలనే నియమం తీసుకొస్తే అటోమెటిక్ గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. కానీ… చినబాబు ఆ సాహసం చేయలేరు!
మరోపక్క జగన్ ఇచ్చిన సంక్షేమ పథకలకంటే రెట్టింపు పథకాలు ఇస్తామని చెప్పిన బాబు… అసెంబ్లీలో వ్యూహాత్మకంగా ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం.. చూస్తుంటే భయమేస్తోంది అని సన్నాయి నొక్కులు నొక్కారు. ఏ ప్రాంతాని వెళ్లినా మైకు పట్టుకుని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ చెప్పిందే చెబుతున్నారు.
మరి ఈ విషయం 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి… జనాలకు హామీలు ఇచ్చేటప్పుడు గ్రహించలేదా అంటే… రాజకీయ అవకాశ వాదమో.. లేక, ప్రజలను వెన్నుపోటు పొడిస్తే, నమ్మించి మోసం చేస్తే ఐదేళ్ల వరకూ ఎవరు అడుగుతారనే ధీమా కావొచ్చు. పైగా… అలా నేరుగా చెప్పలేకో ఏమో కానీ.. సంపద సృష్టించి ఉచిత పథకాలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో అందుతున్న సమాచారం, ఇస్తున్న హింట్ లు, ఇప్పటికీ జగన్ సర్కార్ పైనే విమర్శలు చేస్తున్న తీరు చూస్తుంటే… ఈ ఏడాదికి సూపర్ సిక్స్ పథకాలు అమలు ఆల్ మోస్ట్ ఉండదనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఏపీలో అన్ని వర్గాల నుంచీ, అన్ని వయసుల వారి నుంచీ ఇదే చర్చ సీరియస్ గా జరుతుందని అంటున్నారు. ఐదేళ్లకు అధికారం ఇస్తే ఇలా ఎగ్గొట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రధానంగా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ రూ.15,000 చొప్పున ఇవ్వాల్సి ఉంది. అది ఎగ్గొట్టిన పరిస్థితి! ఇక ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు అంటే… ఒక్కో గ్యాస్ సిలెండర్ రూ.900 అనుకుంటే… సుమారు రూ.2700 నష్టపోయినట్లే. ఇక 18ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1,500 అంటే.. ఏడాదికి 18 వేల రూపాయల నగదు ఇవ్వాలి.
ఇక ఉచిత బస్సు లెక్కేస్తే.. బస్ పాస్ రూపంలో నెలకు రూ.1,500 దాఖా ఖర్చు అవుతున్న పరిస్థితి. నెలకు పదిహేను వందలు అంటే ఏడాదికి రూ.18,000 అన్నమాటే. నిరుద్యోగ భృతి నెలకు రూ.3,000 అని హామీ ఇచ్చారు. అంటే… ఏడాదికి రూ.36,000. మరి ఈ నష్టమంతా ప్రజలే భరించాలా.. లేక, ఎగ్గొట్టిన నెలలలకు వచ్చే నెలలో ఏరియర్స్ కలిపి ఇస్తారా?
ఉచితాల పేరు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఇలా ఎగ్గొడితే ఈ నష్టం ఎవరు భరించాలి అని ప్రజలు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ & కో లను నిలదీస్తున్నారు. కాలర్ పట్టుకుని నిలదీసే అవకాశం వారి చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఇవ్వదు కాబట్టి.. ఆన్ లైన్ వేదికగా ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతదూరం వెళ్తుంది.. ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చనుందనేది వేచి చూడాలి.